మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసింది. ఆ పార్టీ స్పష్టమైన ఆదిక్యం సంపాదించడంతో టీఆర్ఎస్ కథ ముగిసింది. ఇరు పార్టీలకు సమాన సీట్లు వస్తే ఎంఐఎం మద్దతుతో.. ఎమ్మెల్యేల కొనుగోలుతో టీఆర్ఎసే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు కూడా ఫలించలేదు. టిఆర్ఎస్ చాలా దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారానికి అవసరమైన సీట్లు సొంతంగా సాధించింది. చాలా ముందుగానే ఫలితం తేలిపోవడంతో టిఆర్ఎస్ ఓటమిని అంగీకరించేసింది. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా కూడా చేశారు.
అయితే నేరుగా గవర్నరును కలిసి రాజీనామాను సమర్పించడం ఆనవాయితీ. కానీ రాజ్ భవన్ కు వెళ్లకుండా తన రాజీనామా గవర్నరుకు చేరేలా చూశారు. అవమాన భారంతోనే ఆయన ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంపైనా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెరాస పార్టీ పెట్టాక కేసీఆర్ ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. ఓటములు చూశారు. ప్రతిపక్షంలో ఉంటూ కూడా రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించడం.. అధికారంలో ఉన్న వారిని ఉక్కిరి బిక్కిరి చేయడం కేసీఆర్ కే చెల్లింది. అందుకు ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడమే. ఇక తెలంగాణ ఏర్పాటు అయ్యాక అధికారంలో వచ్చి పదేళ్లు పాలించిన కాలంలో కేసీఆర్ ఆధిపత్యం ఎలా సాగిందో అందరికీ తెలుసు.
పాలన, అభివృద్ధి విషయంలో ప్రశంసలు అందుకున్నప్పటికీ.. సచివాలయానికి రాని, ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరేమన్నా తాను అనుకున్నదే చేశారు. ఎవరికి తలవంచిందే లేదు. అలాంటి నేత ఇప్పుడు ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్నారు. ఈ స్థితిలో జనాల్లో తిరగడం, ప్రభుత్వంపై పోరాటం సాగించడం కేసీఆర్ కు కష్టమే. వయసు, ఆరోగ్యం కూడా ఆయన వైపు లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కొడుకు కేటీఆర్ కు పార్టీని అప్పగించి.. నెమ్మదిగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అనధికారికంగా రిటర్మెంట్ తీసుకున్నట్లే.
This post was last modified on December 4, 2023 8:45 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…