తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటిన కాంగ్రెస్ సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు దీటుగా స్థానాలు గెలుస్తుందని ఆశించిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9వ తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది.
ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు వెల్లడించారు. అయితే, అనూహ్యంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నాడు ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించింది. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిని అధికారికంగా సీఎల్పీ నేతగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది. కానీ, రేవంత్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.
ఇక, డిప్యూటీ సీఎం గా ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఎన్నుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పలువురు నేతలు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ నెల 9న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది.
This post was last modified on December 3, 2023 11:01 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…