Political News

తోట చంద్ర‌శేఖ‌ర్ ఐర‌న్ లెగ్గా..? : నెటిజ‌న్ల ట్రోల్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచితీరుతామ‌ని ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు కూడా త‌మ‌ను ఏమీ చేయ‌లేవ‌ని.. ప్ర‌జ‌ల్లో బీఆర్ ఎస్ ప‌ట్ల అనుకూల‌త‌, సానుకూల‌త ఉంద‌ని సీఎం కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ వ‌ర‌కు అంద‌రూ చెప్పారు. అయినా.. పార్టీ ఓడిపోయింది. అయితే.. దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెలుగు లోకి తెచ్చి.. ట్రోల్స్ చేస్తున్నారు. “పార్టీలో ఐర‌న్ లెగ్ కాలుపెట్టింది. అందుకే ఓడిపోయింది!” అని వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆర్ ఎస్‌ను జాతీయ‌పార్టీగా ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఏపీ శాఖ‌కు తోట చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మించింది. అయితే.. ఈయ‌న‌పై అప్ప‌టికే ఐర‌న్‌లెగ్ అనే పేరుంద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. ఆయ‌న ఎక్క‌డ అడుగు పెడితే.. ఆ పార్టీ నాశ‌న‌మ‌వుతుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గ‌తంలో తొలుత చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు తోట‌. 2007లో ప్రారంభ‌మైన ఈ పార్టీ కూడా త‌ర్వాత కాలంలో క‌నుమ‌రుగైంది. క‌నీసం అధికారంలోకి కూడా రాలేక పోయింది. 2014లో ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి తోట అడుగు పెట్టారు.

ఇక‌, ఆ స‌మ‌యంలో అధికారంలోకి వ‌స్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న వైసీపీ కూడా.. ఓడిపోయింది. దీనికి కార‌ణం.. తోటేన‌ని వైసీపీ నాయ‌కులు కూడా అప్ప‌ట్లో ప్ర‌చారం చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. 2019లో ఇదే తోట చంద్ర‌శేఖ‌ర్ ప‌వ‌ర్ స్టార్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్ట‌లో చేరారు. అంతేకాదు.. ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారుకూడా. కానీ, ఆ పార్టీ కూడా అప్ప‌టి ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోయింది. అనంత‌రం.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని ఏపీ ప‌గ్గాలు అందుకున్నారు. మ‌రి ఆయ‌న మ‌హిమో.. ఆయ‌న ఐర‌న్ లెగ్ మ‌హిమో తెలియ‌దుకానీ.. బీఆర్ ఎస్ ప‌దేళ్ల అధికారాన్ని చేజార్చుకుంది. ప్ర‌స్తుతంఇదే విష‌యం నెటిజ‌న్ల మ‌ధ్య ట్రోల్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 3, 2023 7:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

17 minutes ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

7 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

8 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

10 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

11 hours ago