తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ మొత్తాన్ని రేవంత్ ఖాతాలో వేసేందుకు సీనియర్లు సైతం ఎవరూ వెనుకాడడం లేదు. అందరూ రేవంత్‌ను కొనియాడుతున్నారు. రేవంత్ ఇంటికి కీలక అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ క్యూ కడుతున్నారు.
ఇదిలావుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీలోనూ సంబరాలు ఊపందుకు న్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంత తర్వాత.. తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించుకుని, అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేసింది. ఇది.. తమకు కూడా లాభిస్తుందని.. తమపై ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు ప్రచారం కూడా చేశారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీ కాంగ్రెస్ నాయకులు విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణలో గెలిచిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని.. బలమైన ప్రతిపక్షంగా అయినా.. మారుతుందని నాయకులు లెక్కలు వేసుకుంటుండడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 3:47 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…