‘మార్పు’ అంటే ఊహించేందుకే భయపడిన పరిస్థితి. పార్టీలో ఎవరు ఎగస్పార్టీ అవుతారో.. ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎవరు జారిపోతారో.. అనే బెంగ. అయినప్పటికీ.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు కావాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెను సాహసమే చేసింది. తమ పార్టీ కాని నాయకుడిని. నిన్నమొన్నటి వరకు తమపై విరుచుకుపడిన నాయకుడిని.. తమ పార్టీలో చేర్చుకుని.. పెద్దపీట వేసింది.
దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నామని.. పార్టీతో అనుబంధం పెంచుకున్నామని చెబుతూనే.. పార్టీకి గోతులు తవ్వుతున్నారని భావించిన నాయకులను ఏమైనా కానీ.. అనే తెగింపుతో పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్‌రెడ్డి తెరమీదికి వచ్చారు. ఫైర్‌బ్రాండ్. అనే ట్యాగ్ సొంతం చేసుకున్న రేవంత్‌కు మొదట్లో అనేక మంది నాయకులు ఎసరు పెట్టే ప్రయత్నమే చేశారు. ఆయన మొహం చూడను. ఆయన ఉంటే గాంధీ భవన్‌కు వెళ్లను
అని భీష్మించిన నాయకులు ఉన్నారు.
‘రేవంత్ ఎవడు? వానెవణ్నో తెచ్చి.. చేస్తే.. మేం చేతులు కట్టుకోవాల్నా!’ అన్న మాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనేఉన్నాయి. అయినా.. తనకు అప్పగించిన బాధ్యతలను తూ.చ. తప్పకుండా.. తన పీఠానికి ఉన్న అధికారాలను కూడా తగ్గించుకుని రేవంత్ నాలుగు మెట్లు దిగి వచ్చారు. ఫలితంగా.. దాదాపు ఎన్నికలకు ముందు అసంతృప్తులు తగ్గించారు. చిన్నా చితకా ఉంటే.. వాటిని కూడా సరిచేసేందుకు చాలానే శ్రమించారు.
కట్ చేస్తే.. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొలిసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్న పార్టీ ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని.. అధికార పీఠం అధిష్టించే సమయం వచ్చేసింది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ ఫలితం.. ఈ దూకుడు.. ఖచ్చితంగా.. రేవంత్ మంత్రం పలించబట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈవిషయంలో సాహసం చేసిన కాంగ్రెస్ అధిష్టానంతోపాటు.. అంతే కష్టపడిన రేవంత్కు కూడాఫలితం దక్కుతుందని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2023 1:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…