అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే స్పష్టమైన మెజారిటీ కనిపించడానికి అవకాశాలున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీకి దారుణంగా దెబ్బలు పడితే.. గ్రేటర్ పరిధిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో ఏడు మజ్లిస్ అధిక్యతలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో.. బీజేపీ రెండు స్థానాల్లో అధిక్యతలో ఉంది. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉండటం ఆసక్తికరంగా మారింది.
అన్నింటికంటే మించి.. గోషామహల్ లోనూ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉండటం.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్ అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు మీద బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి గోషామహాల్ లో రాజా సింగ్ కు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ప్రస్తుతానికి రాజాసింగ్ వెనుకబడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.
This post was last modified on December 3, 2023 12:02 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…