కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విష యం తెలిసిందే. ఆయ సంప్రదాయంగా పోటీ చేసే కొడంగల్‌తోపాటు.. ఈ దఫా సీఎం, బీఆర్ ఎస్ అధినే త కేసీఆర్ పోటీ చేసిన.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి దిగారు. అయితే..ఈ రెండు నియోజకవ ర్గాల్లోనూ రేవంత్ ముందంజలో ఉండడం గమనార్హం.
కామారెడ్డి లో అయితే.. కేసీఆర్ ఘోర ఓటమి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఓట్ల లెక్కింపులో ఆయన 3 వ స్థానంలో ఉన్నారు. ఇక, అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో రేవంత్ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లొ 70 సీట్లలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్.. మరిన్ని సీట్లలో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇక, ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం కేసీఆర్ హవా కనిపిస్తోంది.
అనేక మంది మంత్రులు ఓటమి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదిలావుంటే, గెలుపు బాటలో వున్న కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ దాదాపు సగటున 5 వేల పైన వుండడం గమనార్హం. రేవంత్ రెడ్డి స్వగ్రామం లో భారీ ఎత్తున సంబరాలు. రేవంత్ రెడ్డి నివాసం కొడంగల్ కు , సొంత గ్రామం లోని నివాసం కు పెద్ద ఎత్తున చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్ పీఎఫ్ బలగాలు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసం భద్రత ను ఇప్పటికే తమ స్వాధీనం లోకి తీసుకున్న సీఆర్ పీఎఫ్ బలగాలు.
ఇక, హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్..రెండు చోట్లా వెనుకబడిపోయారు. గజ్వేల్‌లో మరీ దారుణంగా మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఇక, హుజూరాబాద్‌లో సెంటిమెంటు అస్త్రం ప్లే చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఈ సారి విజయం దక్కించుకునే దిశగా దూసుకుపోతుండడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 11:30 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…