Political News

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో ప్ర‌తిబింబించిన వ్య‌తిరేక‌త‌..

కాపురం చేసే క‌ళ‌.. కాలిగోటిలోనే తెలుస్తుంద‌న్న‌ట్టు.. ఏరాష్ట్రంలో అయినా..ఎన్నిక‌ల పోలింగ్ మొద‌లు కాగానే.. తొలుత లెక్కించే పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనే గెలిచే పార్టీని అంచ‌నా వేసేయొచ్చు. అలానే తెలంగాణ లోనూ.. పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశాయి. తొలి రౌండ్ లెక్కింపు నుంచి కూడా పోస్ట‌ల్ బ్యాలెట్‌లు.. ఎక్క‌డా చికాకు పెట్ట‌లేదు. ఎవ‌రినీ ఊరించ‌లేదు. చాలా స్ప‌ష్టంగా.. చాలా ప‌క్కాగా త‌మ అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి.

కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా పోస్ట‌ల్ బ్యాలెట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ఇదే.. కాంగ్రెస్‌కు బ‌ల‌మైన శ‌క్తిగా మారింది. ఇక‌, పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యానికి వ‌స్తే.. బీఆర్ ఎస్ నాయ‌కులు కేసీఆర్‌(గ‌జ్వేల్‌, కామారెడ్డి), కేటీఆర్(సిరిసిల్ల‌) కూడా.. వెనుక‌బ‌డిపోయారు. చివ‌రి వ‌ర‌కు వారికి పోస్ట‌ల్ బ్యాలెట్ అనుకూలంగా లేదు. ఇక‌, ఈవీఎంల ఓట్లు లెక్కించ‌డం ప్రారంభించాక మాత్రమే.. ఇద్ద‌రూ తేరుకున్నారు.

అయితే.. ఈ పోస్ట‌ల్ బ్యాలెట్‌లో ఎందుకింత బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేక‌త క‌నిపించింది? దీనివెనుక ఉన్న రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. పోస్ట‌ల్ బ్యాలెట్ అంటే.. ఇది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అభిప్రాయాల‌ను చెప్పేది. సో.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ఉద్యోగులు కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌నేది పోస్ట‌ల్ బ్యాలెట్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

ప్ర‌తి నెలా 1న జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డం.. సీపీఎస్ ర‌ద్దు చేయ‌క‌పోవ‌డం.. ఉద్యోగుల‌కు సంబంధించి డీఏల‌ను ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగులో పెట్టడం, రాజ‌కీయ ఒత్తిళ్లు.. ఇలా అనేక కోణాల్లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను నిరాశే ప‌రిచింది. ఇదే పోస్ట‌ల్ బ్యాలెట్ రూపంలో స్ప‌ష్ట‌మైంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on December 3, 2023 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

2 hours ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

4 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

4 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

7 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

8 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

9 hours ago