దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం మినహా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరా హోరీ యుద్ధం జరిగింది. ఇక, ఇప్పుడుతుది ఫలితాల్లోనూ తొలి రెండు రౌండ్లలో బీజేపీ -కాంగ్రెస్‌లు.. పోటా పోటీగా వ్యవహరించినా.. ఇప్పుడు ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో బీజేపీకి సానుకూల పెరిగింది.
ఛత్తీస్ గడ్: ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 38 స్థానాలు దక్కించుకున్నాయి. మరో రెండు స్థానాలను ఇతరులు దక్కించుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ 46.
రాజస్థాన్: ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం స్థానాలు 200. కానీ, 119 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. అయితే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పార్టీని మారుస్తున్న నేపథ్యంలో అదేసంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగింది. బీజేపీ 117 స్తానాల్లో విజయం దక్కించుకోగా, కాంగ్రెస్ 67 స్థానాలకే పరిమితమైంది.
మధ్యప్రదేశ్: ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మొత్తం నియోజకవర్గాలు.. 230. వీటిలో బీజేపీకి 140 స్థానాలు దక్కగా.. కాంగ్రెస్‌కు 87, ఇతరులకు 3 స్థానాలు మాత్రమే లభించాయి. మొత్తంగా చూస్తే.. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ రెండు కోల్పోగా.. మరో రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకోలేక పోయింది.
This post was last modified on December 3, 2023 1:05 pm
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…