Political News

ప్లాష్ బ్యాక్: ఇప్పుడు రేవంత్ మాదిరే 2004లో వైఎస్ పరిస్థితి!

సందర్భానికి తగ్గట్లు కొన్ని పరిణామాల్ని గుర్తుకు తెచ్చుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.  హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ సర్వేలన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఖాయమని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మాట బలంగా వినిపించాయి. ఫలితాల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించటం సమయోచితంగా ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు.. అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఎంత శక్తివంతంగా ఉండేవారో తెలిసిందే. ఇలాంటివేళ.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించేది. అప్పట్లో ఆ పార్టీ ఆశలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదే పెట్టుకునేవారు. ఇందుకు తగ్గట్లే వైఎస్ ఒళ్లు దాచుకోకుండా తీవ్రంగా శ్రమించటమే కాదు..  పార్టీని అధికారంలోకి రావటానికి అవసరమైన అన్ని పనులను చక్కబెట్టేవారు.

2004 ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరిగిన తర్వాత దాదాపు వారం రోజులకు పైనే కౌంటింగ్ ఆగింది. మిగిలిన రాష్ట్రాలతో పాటు.. ఎన్నికల ఫలితాల విడుదలను ఏపీలోనూ ఆగింది. దీంతో.. రిజల్ట్ వచ్చే వరకు తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ తో కిందా మీదా పడేవారు. అప్పట్లో చంద్రబాబు మీద విపరీతమైన ద్వేషం ఉందన్న మాట నాటి అధికార పార్టీతో పాటు.. ప్రత్యర్థి పార్టీలోనూ బలంగా వినిపించేది.

ఇదిలా ఉండగా.. పోలింగ్ లో కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న రిపోర్టులు వచ్చినప్పటికి.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేటిని నమ్మకూడదన్నట్లుగా వైఎస్ ఉండేవారు. అందరి ఎదుట గెలుపు ధీమాను వ్యక్తం చేసినప్పటికీ.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి దగ్గర మాత్రం తనకున్న సందేహాల్ని వ్యక్తం చేసేవారు. అయితే.. వారంతా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుస్తుందని చెప్పేవారు. అయినప్పటికి వైఎస్ కు నమ్మకం కుదిరేది కాదు. ఇలాంటి వేళ.. కొందరు జర్నలిస్టు ముఖ్యుల్ని పిలిపించుకొని.. వారితో విశ్లేషణ చేయించుకున్న తర్వాత కాస్తంత నెమ్మదించేవారు.

అప్పట్లో వైఎస్ ఎలాంటి మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద రేవంత్ నమ్మకంగా ఉన్నప్పటికీ.. లోలోన ఏదో ఒక శంక బలంగా ఉండి.. సందేహాల్ని సంధిస్తున్న వైనం వినిపిస్తోంది. సాధారణంగా ఇంతటి హోరాహోరీ ఎన్నికల యుద్ధం జరిగిన తర్వాత.. మిగిలిన వారి మాదిరే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం బోలెడంత కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పాలి. తాజా ఎన్నికల్లో  అంచనాలు మహా కష్టంగా మారిన నేపథ్యంలో.. తనకు అత్యంత సన్నిహితుల వద్ద రేవంత్ నోట వస్తున్న సంశయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. అప్పట్లో వైఎస్ లాంటి బలమైన నేతకే తప్పనిది.. ఇప్పుడు రేవంత్ కు ఇలంటి పరిస్థితి ఎదురైన వైనాన్ని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

This post was last modified on December 3, 2023 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిక్ టాక్: సూపర్ సెక్సీ ‘పెళ్ళికూతురు’

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న అమ్మాయి అవికా గోర్. ఆ గుర్తింపుతోనే…

10 hours ago

నభూతో అనిపించేలా మోక్షు లాంచింగ్

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రకటన రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ…

11 hours ago

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని టీడీపీ ..!

టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిమూలంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రిగింది. నిన్న మొన్న‌టి…

15 hours ago

బెంగళూరును ముంచెత్తిన గోట్.. గొడవ గొడవ

బెంగళూరులో స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ గొడవ చేయడం ఎప్పట్నుంచో ఉన్న సమస్య. ఈ మధ్య ఈ గొడవ మరింత…

18 hours ago

దేవర ఊపు మామూలుగా లేదు

వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయాక ‘కల్కి’ జోరుతో కొంచెం కోలుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ కొంత ఉత్సాహాన్నిచ్చింది. భారీ వర్షాల్లోనూ…

18 hours ago

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం…

18 hours ago