Political News

పాల‌మూరులో రేవంత్‌రెడ్డి చెప్పిందే జ‌రుగుతుందా?

ఏ పార్టీలో అయినా అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు.. వారి వారి సొంత జిల్లాల‌పై ప‌ట్టుంటుంది. అంతేకాదు.. తాము అంచ‌నా వేస్తే.. ఇక‌, జ‌రిగి తీరుతుంద‌నే న‌మ్మ‌కం కూడా వారికి ఉంటుంది. ఇలా.. తెలంగాణ  పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా త‌న సొంత జిల్లాపై అనేక అంచ‌నాలు వేసుకున్నారు. తాను చెప్పిందే జ‌రు గుతుంద‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్ సొంత జిల్లా పాల‌మూరురంగారెడ్డి జిల్లా. ఇక్క‌డ 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

అయితే.. ప్ర‌స్తుతం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జిల్లా మొత్తం కాంగ్రెస్‌పార్టీ స్వీప్ చేస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇంత కాన్ఫిడెంట్‌గా రేవంత్ రెడ్డి చెప్ప‌డానికి రెండు రీజ‌న్లు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఒకటి అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు.. ఈ జిల్లా నుంచి తొలిసారి అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టే నాయకుడుగా రేవంత్ ఎద‌గ‌డం. దీంతో ఆయ‌న‌ను మ‌రింత స‌పోర్టు చేయాలంటే.. పార్టీలో ఆయ‌న మాట నెగ్గాలంటే.. జిల్లాలోని అన్ని సీట్ల‌ను కానుక ఇస్తార‌నే ధీమా రేవంత్‌కు ఉంది.

ఇక‌, రెండోది.. పాల‌మూరు రంగారెడ్డిజిల్లాలో గ‌తానికి భిన్నంగా పార్టీనేత‌ల‌ను ఆచితూచి టికెట్‌లు ఎంచుకున్నారు. దీంతో వారంతా గెలిచి తీరుతానే భావ‌న కూడా ఆయ‌న‌కు వుంది. ఇక‌, మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు..ఇక్క‌డ బీఆర్ ఎస్‌కు చెక్ పెడ‌తాయ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. వెర‌సి.. పాల‌మూరు రంగారెడ్డిలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని రేవంత్‌చెబుతున్నారు.

ఇదిలావుంటే, జిల్లా ల‌వారీగా.. వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్ విజ‌యం ఖాయమ‌ని తేలిపోయింది. ఇక‌, మిగిలిన 13 నియోజ‌క‌వ‌ర్గాలో 8 చోట్ల కాంగ్రెస్ నాయ‌కులు గెలుస్తార‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. దీంతో రేవంత్‌చెప్పిన‌ట్టు క్లీన్ స్వీప్ చేయ‌క‌పోయినా.. మెజారిటీ స్థానాలు గెలుచుకోవ‌డం త‌థ్య‌మ‌నే భావ‌న అయితే ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 2, 2023 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప-2… బుల్లితెరపైకి ఎప్పుడు?

గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…

11 minutes ago

జగన్ రాయబారానికి సాయిరెడ్డి లొంగుతారా…?

వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…

35 minutes ago

కొత్తవాళ్లతో మణిరత్నం వింటేజ్ రొమాన్స్

దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…

43 minutes ago

“ఏపీలో కాంగ్రెస్ ఉందా?.. ఉంటే ఉన్న‌ట్టు.. లేదంటే లేన‌ట్టు!”

"ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్న‌ట్టు.. లేదంటే లేన‌ట్టు!"- జాతీయ స్థాయి నాయ‌కుడు, మాజీ సీఎం దిగ్విజ‌య్…

1 hour ago

అఖండ‌-2లో ఆమె ఉంది.. ఈమె చేరింది

వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఊపుమీదున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న ద‌శ తిరిగేలా చేసిన సినిమా.. అఖండ‌నే. ఆ సినిమా ఎవ్వ‌రూ…

2 hours ago

జ‌న‌సేన‌లోకి ఆమంచి.. చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మేనా..!

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన ప‌రిస్థితి డోలాయ‌మానంలో ఉంది.…

3 hours ago