ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరొ 24 గంటల్లో ఫలితం కూడా రానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఫలితాల వెల్లడి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీలకైన నాలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్(మరోసారి), ఛత్తీస్‌గఢ్ల(మరోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థులకు తన అభ్యర్థులు చిక్కకుండా ముందస్తు జాగ్రత్తలకు హస్తం పార్టీ సిద్ధమైపోయింది.
మరీ ముఖ్యంగా తెలంగాణను ఇచ్చామన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని..దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. టఫ్ ఫైట్ ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఇతర పార్టీలు తమ వారిని లాక్కునే ప్రయత్నం చేస్తాయనే భావన కాంగ్రెస్ నాయకుల్లోను.. అధిష్టానంలోనూ కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఒక్క అభ్యర్థినీ చేజారకుండా చూసుకునే బాధ్యతలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, షార్ప్ షూటర్ డీకే శివకుమార్‌కు అప్పగించింది. దీంతో ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఎంతగా అంటే.. వాస్తవానికి అధికారిక పనిమీద.. డీకే దుబాయ్ వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి.. శుక్రవారం టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. కానీ, ఆయన మాత్రం ఈ పర్యటనను వాయిదా వేసుకోవడంతోపాటు.. అటు రాజస్థాన్, ఇటు తెలంగాణ నేతలతో టచ్‌లోకి వచ్చేశారు. గెలుస్తారనే నాయకులను ఆయన మచ్చిక చేసుకుంటున్నారు. వారిని నిరంతరం కనిపెడుతున్నారు. అంతేకాదు.. వారిని అవసరమైతే.. శనివారం మధ్యాహ్నానికే(ఆదివారం ఫలితాలకు ముందే) బెంగళూరుకు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
బెంగళూరు శివారులోని 600 మంది బస చేయగల ఈగల్టన్ రిసార్టును గుండుగుత్తగా కాంగ్రెస్ బ్లాక్ చేసేసింది. ఈ గదులను ఎవరికీ ఇవ్వద్దని పార్టీ నుంచి అడ్వాన్సులు కూడా అందినట్టు సమాచారం. ఈ క్రమంలో గెలుపు గుర్రం ఎక్కే నాయకులు, ప్రలోభాలకు గురవుతారని అనుమానం ఉన్ననాయకులను శనివారం మధ్యాహ్నానికే ఈగల్టన్‌కు తరలించేలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. “పరిస్థితులు బాగోలేదు. మావాళ్లను మేం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలంగాణ ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఆ రాష్ట్ర మంత్రి జావేద్ వెల్లడించడం.. ఈ పరిణామాలకు మద్దతుగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఏర్పాట్లు.. గతంలోనూ ఇలానే జరిగాయి. మరి ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 8:22 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…