ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బలమైన జిల్లాలు చాలానే ఉన్నాయి. ఉభయ గోదావరులు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణా వంటివి కేడర్ పరంగా బాగున్న జిల్లాలు. వీటిలో మరీ ముఖ్యంగా సీమ పరిధిలో ఉన్న అనంతపురం టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఇక్కడి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుచుకుంది. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం ఒక్క హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది.
అయినప్పటికీ.. కేడర్ బలంగానే ఉంది. ఇక, ఈ అనంతపురంలోనూ రెండు నియోజకవర్గాలు టీడీపీకి బలమైన నియోజకవర్గాలు.. వ్యక్తులు, పార్టీ పరంగా చూసుకున్నా.. ఈ రెండు పార్టీకి కీలకమై. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడున్నా.. వైసీపీ నాయకులు కాలు దువ్వుతున్నా.. పార్టీ ఎదురీత ఈదుతోంది. అయితే.. అనంతలోని ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం.. వైసీపీ దూకుడు లేకున్నా.. టీడీపీ అంతర్గత సమస్యలతో విలవిల్లాడుతోంది.
నిజానికి ప్రధాన ప్రత్యర్థుల నుంచి ఇక్కడ బలమైన పోటీ లేదు. కానీ, పార్టీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు.. పంతాలు పట్టింపులు తెలుగు దేశం పార్టీని ఇరుకున పెడుతున్నాయి. వీటిలో అనంతపురం అర్బన్, పుట్టపర్తి నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, పల్లె రఘునాథరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, తాడిపత్రి బ్రదర్స్.. జేసీ ప్రభాకర్, దివాకర్‌ల హవా.. ఈ రెండు నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
వారు రారు.. ఎవరినీ రానివ్వరు.. అన్నచందంగా పార్టీ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇదేసమయంలో .. పార్టీలో ప్రస్తుతం ఉన్న వైకుంఠం చౌదరికి. రఘునాథరెడ్డికి టికెట్లు ఇవ్వరని.. తాము చెప్పిన వారికే టికెట్లు ఇస్తారని.. అంతర్గత ప్రచారం చేయిస్తున్నారు. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో తాడిపత్రి బ్రడర్స్ ట్యాగ్‌తో వస్తున్న ఈ ప్రచారం.. టీడీపిన ఇబ్బంది పెడుతోంది.
ఇక, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా.. ఈ రెండు నియోజకవర్గాల్లో సందడి చేయాలని అనుకున్న వైకుంఠం, పల్లెల కార్యక్రమాలకు కేడర్ వెళ్లకుండా.. తాడిపత్రి బ్రదర్స్ కట్టడి చేశారు. ఇక, ఇప్పుడు టికెట్లపై కాక రేపుతున్నారు.ఇన్ని తెలిసినా.. పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది.
This post was last modified on December 1, 2023 3:59 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…