ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే.
అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే పరిస్థితి. తాజాగా మరింత అప్పు అవసరమైన నేపథ్యంలో ఏపీ సర్కారు ద్రవ్య నియంత్రణ- బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 3.5 శాతం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త అప్పు తీసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఆర్డినెన్సు పుణ్యమా అని మరో రూ.20వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తసీుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే.. ఈ ఆర్డినెన్సును మోడీ సర్కారు ఓకే చేయాల్సి ఉంటుంది. ఏమైనా.. తరచూ అప్పులు చేస్తూ.. పాలనా రథాన్ని లాగించటం కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి నుంచి ఏపీ సర్కారు ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 4:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…