తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందని.. మెజారిటీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ సొంతం చేసుకుంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఒకటి రెండు తప్ప.. మిగిలిన సర్వేలు.. పూర్తిస్థాయిలో మెజారిటీ కూడా కాంగ్రెస్ పంపాయించుకుంటుందని అంచనా వేశాయి. సో.. డిసెంబరు 3నాటి ఫలితం ముందు.. ఇప్పుడు వచ్చిన సర్వేల రిజల్ట్.. సహజంగానే కాంగ్రెస్‌లో ఊపు తెచ్చింది.
తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్.. గత పదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. అయినా.. తెలంగాణ ప్రజలు గత రెండు ఎన్నికల్లోనూ పార్టీని ఆదరించలేదు. ఇక, ఇప్పుడు మాత్రం ఆదరిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఈ క్రెడిట్ మొత్తం పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డికే వస్తుందని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేర్చి.. పార్టీని నిలబెట్టేందుకు ఆయన చేసిన కృషిని కూడా తలుచుకుంటున్నారు.
“ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమై.. కాంగ్రెస్‌పార్టీ విజయం దక్కించుకుంటే.. అది పూర్తిగా రేవంత్ క్రెడిటే” అని కొడంగల్ నియోజకవర్గం నాయకులు చెబుతున్నారు. ఇక, అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ నేతలు కూడా.. రేవంత్ కృషిని తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. అనేక విమర్శలు.. అపవాదు లు.. మాటల తూటాలు.. ఎదుర్కొన్న రేవంత్‌ను చెక్కిన శిల్పమనే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి సహాయనిరాకరణ ఓ రేంజ్‌లో రేవంత్‌ను కుదిపేసింది. మిగిలిన నాయకులు జగ్గారెడ్డి వంటి వారు కూడా.. ఎక్కడ నుంచో వచ్చినోళ్లకు పదవులు ఇస్తున్నారంటూ.. విమర్శలు గుప్పించారు. ఇటు వీళ్లని గాడిలో పెట్టుకుంటూనే అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి వస్తున్న విమర్శలు.. దాడులు.. నియోజకవర్గాల్లో కార్యకర్తల, నాయకుల జంపింగులను తట్టుకుని.. రేవంత్ తాను నిలబడి.. పార్టీని పరుగులు పెట్టించిన తీరు.. నభూతో అనే చెబుతున్నారు పరిశీలకులు.
నిజంగానే రేపు డిసెంబరు 3న పార్టీ విన్ అయి. అధికారంలోకి వస్తే.. రేవంత్ కృషిని విస్మరించలేమని అంటున్నారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు.. ఎదురీతలు.. ఢీ అంటే ఢీ అన్నట్టుగా బీఆర్ ఎస్‌కు పోటీగా నిలవడం వంటివాటిని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా.. రేవంత్ రాకతోనే సాధ్యమైందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన అధికార పీఠం రేవంత్ హయాంలో దక్కుతుండడం మరింతగా ఆయన హవాను పెంచుతుందని లెక్కలు వేస్తున్నారు.
This post was last modified on December 1, 2023 1:58 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…