Political News

2018 ఎగ్జిట్ పోల్‌.. కేటీఆర్ కామెంట్స్‌తో వెతికేసిన నెటిజ‌న్లు

తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? అనే విష‌యాల‌పై తాజాగా అనేక సర్వేలు వ‌చ్చాయి. కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య మూడు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉంటుంద‌ని స‌ర్వేలు చెప్ప‌గా.. ఒక రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస్‌-అక్క‌డి స్థానిక పార్టీ ఎంఎన్‌పీల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాయి. అయితే.. తెలంగాణ‌లో కూడా ఇంతే పోటీ ఉంటుంద‌ని చెప్పినా.. కాంగ్రెస్‌కు ఆధిక్యం ఇచ్చాయి.

ఇదిలావుంటే.. ఈ స‌ర్వేల‌పై తెలంగాణ‌లో ఉత్కంఠ నెల‌కొంది. తాము ఈ స‌ర్వేల‌ను న‌మ్మేది లేద‌ని.. బీఆర్ ఎస్ నేత‌, మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. అంతేకాదు.. డిసెంబ‌రు 3న సర్వే సంస్థ‌లు తేడా వ‌స్తే.. క్ష‌మాప‌ణ‌లు చెబుతాయా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, 2018లోనూ ఇలానే త‌మ‌కు వ్య‌తిరేకంగా స‌ర్వే రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని.. కానీ, కేసీఆర్ విజ‌యం ద‌క్కించుకుని. అధికారంలోకి వ‌చ్చార‌ని కేటీఆర్ చెప్పారు.

ఇక‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ స‌ర్వే సంస్థ‌ల నిజాయితీని కొనియాడారు. అవి త‌ప్పు చెప్ప‌బోవ‌మ‌ని అన్నారు. కొద్దిపాటి తేడా ఉన్న‌ప్ప‌టికీ.. స‌ర్వేలు నిజ‌మే చెబుతున్నాయ‌న్నారు. దీంతో ఇప్పుడు అస‌లు 2018లో ఏం జ‌రిగింది? కేటీఆర్ చెప్పిన‌ట్టు అప్ప‌ట్లో కేసీఆర్ ఓడిపోతున్నార‌ని స‌ర్వేలు వెల్ల‌డించాయా? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీంతో తెలంగాణ జ‌నాలు.. ఇప్పుడు నెట్‌లో తీవ్రంగా ఈ విష‌యంపై శోధిస్తున్నారు.

2018లో తెలంగాణ‌లో ఏం జ‌రిగింది? అప్ప‌టి స‌ర్వే ఫ‌లితాలేంటి? అనే విష‌యాన్ని భారీగా వెతికే ప‌నిలో ప‌డ్డారు. అంతేకాదు.. స‌ర్వేలు త‌ర్వాత‌.. వ‌చ్చిన రిజ‌ల్ట్‌పైనా నెటిజ‌న్లు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా.. 2018లో స‌ర్వేలు ఏం చెప్పాయి? అనే ప్ర‌శ్నే ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

2018లో స‌ర్వేలు ఏం చెప్పాయంటే

సీఎన్ ఎక్స్ స‌ర్వే ప్ర‌కారం… టీఆర్ ఎస్ భారీ మెజారిటీ ద‌క్కించుకుంటుంది. ఏకంగా.. 62-70 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. కాంగ్రెస్‌కు 32-38 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంది.

టీవీ 9: ఈ స‌ర్వే ప్ర‌కారం.. బీఆర్ ఎస్‌కు 75-85 సీట్లు, కాంగ్రెస్‌కు 25-35 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పింది.

రిప‌బ్లిక్ సీ ఓట‌రు: ఈ స‌ర్వే ప్ర‌కారం.. బీఆర్ ఎస్‌కు 56-62 సీట్లు, కాంగ్రెస్‌కు 47-59 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది.

టైమ్స్ నౌ: బీఆర్ ఎస్‌కు 66 స్థానాలు, కాంగ్రెస్‌కు 37 సీట్లు వ‌స్తాయ‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

కొస‌మెరుపు: ఎన్నిక‌ల వాస్త‌వ ఫ‌లితాల్లోనూ ఇదే నిజ‌మైంది. టీఆర్ ఎస్‌కు 88 సీట్ల‌లో విజ‌యం ద‌క్కింది. కాంగ్రెస్ 19 స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇక‌, టీడీపీ రెండు చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. స్వ‌ల్ప తేడాలే త‌ప్ప‌.. భారీ తేడాలైతే.. క‌నిపించ‌లేదు.

This post was last modified on November 30, 2023 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

2 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

2 hours ago

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

8 hours ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

10 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

10 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

12 hours ago