Political News

ఆంధ్రప్రదేశ్ నంబర్ టూ

ఒక ప్రమాదకర విషయం బయటపడ్డపుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ అదే ప్రమాదకర పరిస్థితి రోజుల తరబడి కొనసాగుతున్నపుడు.. ఒక దశ దాటాక అది మామూలు విషయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం తాలూకు వార్తలు ఇలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏపీలో వందల్లో కేసులు బయటపడుతుంటేనే తెగ భయపడిపోయే వాళ్లం. కానీ అది వేల స్థాయికి వెళ్లిపోయి చాలా కాలం అయింది.

ఒక దశలో రోజుకు పది వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. తొలిసారి ఆ మార్కును అందుకున్నపుడు వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇదే పరిస్థితి కొన్ని వారాలుగా కొనసాగుతోంది. కేసులు నిలకడగా పది వేల మార్కును టచ్ చేస్తున్నారు. రోజుకు 80-100 మంది మధ్య చనిపోతున్నారు. చూస్తుండగానే దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో పైపైకి వెళ్లిపోతోంది ఏపీ.

ఇప్పుడు ఏకంగా ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. ఆదివారం నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 24,767కు చేరుకుంది. ఆదివారం కూడా 10,603 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు (4,22,085)ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది ఏపీ. యాక్టివ్ కేసుల్లోనూ ఏపీది రెండో స్థానమే. 99,129 యాక్టివ్ కేసులున్నాయి ఏపీలో. ఈ విషయంలో తమిళనాడు (52,721) చాలా మెరుగు.

మహారాష్ట్ర మొత్తం 7,80,689 కేసులతో అగ్ర స్థానంలో ఉంది. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1,93,548. ఏపీలో 3 లక్షల మందికి పైగానే కరోనా బాధితులు రికవర్ అయ్యారు. ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని చోట్లా కరోనా విలయం కొనసాగుతోంది. గోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఏపీలో 3,884 మంది మరణించారు. ఇక ఇండియా మొత్తంలో కరోనా కేసులు 36 లక్షల మార్కును దాటేశాయి. ఇప్పటిదాకా 64,617 మంది కరోనా వల్ల చనిపోయారు.

This post was last modified on August 31, 2020 4:55 pm

Share

Recent Posts

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

47 minutes ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

6 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

7 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

10 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

10 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

12 hours ago