Political News

ఓడితే శ‌వ‌యాత్రే.. : ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం ముగిసినా.. అభ్య‌ర్థుల‌కు ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌డం లేదు. ఒక‌వైపు వారు ప్ర‌చారానికి చేసిన ఖ‌ర్చు లెక్క‌లు తేల్చేందుకు ఎన్నిక‌ల సంఘం రెడీ కావ‌డంతో అంద‌రూ స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు.. చివ‌రి నిముషంలో ప్ర‌జ‌ల‌ను ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకునేందుకు, వారిని సెంటిమెంటుతోత‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. ప్ర‌య‌త్నించ‌డం.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంప‌ట్ల కూడా.. ఎన్నిక‌ల సంఘం చాలా సీరియ‌స్ అయింది.

తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల సంగ‌తి తేల్చాల‌ని.. ఎన్నిక‌ల సంఘం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది. ఎన్నికల ప్రచారం చివ‌రి రోజు సాయంత్రం కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒకవిధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. గెలిస్తే జైత్ర యాత్ర‌.. ఓడితే శ‌వ‌యాత్రే.. ఏది కోరుకుంటారో మీ ఇష్టం అంటూ.. కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు మీడియాలో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో సుమోటోగా దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ఈ వ్యాఖ్య‌ల సంగ‌తేంటో తేల్చాల‌ని.. జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ చేప‌ట్టేలా ఆదేశించాల‌ని కూడా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. మొత్తంగా.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌ల దుమారం అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. కౌశిక్‌రెడ్డి వివ‌ర‌ణ‌పై సంతృప్తి చెందితే స‌రే.. లేక‌పోతే ఏం చేస్తార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. కాగా, కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌ల‌ప‌డుతున్నారు.

This post was last modified on November 29, 2023 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల…

32 minutes ago

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

1 hour ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

1 hour ago

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను…

2 hours ago

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…

2 hours ago

ఆ రాష్ట్రంలో 400 మంది చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…

3 hours ago