ఉమ్మడి కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అయిపోయానట్లేనట. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్చార్జిల హోదాలో ముగ్గురు తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమంటున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన హామీల కారణంగా తామే అభ్యర్ధులం అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతు బారీగా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కమలాపురంలో రవీంద్రనాధ రెడ్డి ఎంఎల్ఏలుగా ఉన్నారు. నిజానికి వీళ్ళముగ్గురు గట్టి అభ్యర్ధులనే చెప్పాలి. వీళ్ళల్లో డాక్టర్ సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లోనే డైరెక్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫారాయించటంతో 2019 ఎన్నికల్లో డాక్టర్ కు టికెట్ దక్కింది.
ఇక టీడీపీలో చూస్తే పుట్టా ఇప్పటికే ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి తిరుపతి తిరుమల దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఆర్ధికంగా బాగా గట్టి నేతనే చెప్పాలి. ఇక పుత్తా నర్సింహారెడ్డి సీనియర్ తమ్ముడే. నియోజకవర్గంలో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. భూపేష్ రెడ్డిని తీసుకుంటే చెప్పుకోదగ్గ సీనియారిటి లేదు. ఇదే సమయంలో గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం పార్టీకి మైనస్ అనే చెప్పాలి.
వీళ్ళలాగే కడపలో మాధవీరెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్ధి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భార్య హోదాలో మాధవి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు కారణంగా ఎక్కడైనా చివరినిముషంలో అభ్యర్ధులు మారితే మారచ్చని తమ్ముళ్ళు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. లేకపోతే టీడీపీ తరపున వీళ్ళే అభ్యర్ధులుగా ఉంటారటంలో సందేహంలేదు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…