Political News

జ‌న‌సేన నేత‌లను ట్విస్ట్ చేస్తున్న ప‌వ‌న్!

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. వాస్త‌వానికి నిక్క‌చ్చిగా చెప్పాలంటే.. ఈ మిత్ర‌ప‌క్షానికి ఇరు పార్టీల నుంచి స్పంద‌న పెద్ద‌గా రావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఇప్ప‌టికే.. వేర్వేరుగానే పోటీ ఉంటుంద‌ని.. భావించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే క‌లిసిపోటీ అనే అంశం తెర‌మీద‌కి రావ‌డంతో నాయ‌కులు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

దీంతో ఇరు పార్టీలు క‌లిసి తీసుకున్న స‌మ‌న్వ‌య స‌మావేశాలు.. ఆదిలోనే బెడిసి కొట్టాయి. కొన్ని జిల్లాల్లో ఇరు పార్టీల నాయ‌కులు కూడా.. బాహాబాహీకి దిగితే.. మ‌రికొన్ని చోట్ల అసంతృప్తులు వెలుగుచూశాయి. ఇంకొన్ని చోట్ల ముఖ‌స్తుతితో ప‌నికానిచ్చారు. కానీ.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. దీంతో స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిసిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన రెండు ప్ర‌క‌ట‌న‌లు నాయ‌కుల‌ను మ‌రింత ట్విస్ట్‌కు గురి చేస్తున్నాయి.

ఒక‌టి.. ప‌దేళ్ల వ‌ర‌కు ఏపీలో మ‌నం మిత్ర‌ప‌క్షంగానే ఉందామ‌ని చెప్ప‌డం.. రెండు.. ప‌దువుల ఆశించ‌వద్దు.. కేవ‌లం వైసీపీని పార‌దోల‌డ‌మే ప‌నిగా క్షేత్ర‌స్తాయిలో యుద్ధం ప్ర‌క‌టించాల‌ని విశాఖ వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లు కూడా.. జ‌న‌సేనలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చేసిన‌ట్టే ఏపీలోనూ చేస్తారా? అనేది నాయ‌కుల సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. క‌నీసం 40 స్థానాల్లో బ‌ల‌మైన జ‌న‌సేన నాయ‌కులు పోటీకి రెడీ అవుతున్నారు.

కానీ.. పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లు ద‌క్కే చాన్స్ లేదు. పైగా ఇప్పుడు ప‌దేళ్ల పాట మ‌రింతగా వారిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేయాల‌ని చెప్ప‌డం కూడా.. నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఇదేంట‌ని? వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే 10 ఏళ్ల‌కుపైగా ఎద‌రు చూస్తున్నామ‌ని.. జెండాలు మోస్తున్నామ‌ని.. మ‌రో ప‌దేళ్లు వెయిట్ చేయాలా? అనివారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిని ఎదుర్కొనేందుకు త్వ‌ర‌లోనే జ‌న‌సేనాని నియోజ‌క‌వ‌ర్గాల బాట ప‌డతార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 27, 2023 2:16 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago