అటు ప్రచార సభలు, సమావేశాలు, రోడ్ షోలు, మీడియాతో ఇంటర్వ్యూలు, విలేకర్ల సమావేశాలు ఇలా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎక్కడ చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒక్కడే సైన్యంగా మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను భుజాలపై మోసుకుంటూ సాగిపోతున్నారు. పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీని ఆయన పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయంటే అందుకు రేవంత్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో పార్టీకి లభిస్తున్న ఆదరణను ఓట్లుగా మార్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రోజుకు అయిదారు సభలు, సమావేశాల్లో పాల్గొంటు ఒక్కడే పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే చెప్పాలి.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్, కోమటి రెడ్డి సోదరులు, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లాంటి నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని చెప్పాలి. తమ విజయం కోసం ఈ కాంగ్రెస్ నాయకులు పాటుపడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ఢిల్లీ నేతలు సభలు, సమావేశాలు పెడితే మాత్రమే ఈ నాయకులు కనిపిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇతర సమయాల్లో కేవలం తమ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ రేవంత్ మాత్రం సుడిగాలిలా రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నారు. పదునైన మాటలతో కేసీఆర్ ను ఇరకాటంలో పెడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్ కు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అనే స్పష్టమైన సమాచారం అందిందని తెలిసింది. దీంతో రేవంత్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నారని చెబుతున్నారు.
This post was last modified on November 27, 2023 10:55 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…