Political News

నేను కాపోణ్ని.. రైతుల క‌ష్టాలు నాకు తెలుసు!

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కులు.. ఏం చెబుతారో పెద్ద‌గా ఊహించాల్సిన అస‌వ‌రం లేకుండా పోయింది. ఎక్క‌డికి వెళ్తే అక్క‌డి పాటే పాడుతున్నారు. పైగా పోటీ తీవ్రంగా ఉన్న తెలంగాణ‌లో అయితే.. మ‌రింత‌గా ఎక్కువ‌గా నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా సీఎం కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను కాపోణ్నే.. నేను కూడా వ్య‌వ‌సాయం చేస్తా. వ‌రి నాటేస్తా.. నాకు రైతుల క‌ష్టాలు తెలుసు! అని వ్యాఖ్యానించారు.

తాజాగా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన కేసీఆర్‌.. జాన్స‌న్ నాయ్ ప‌క్షాన ప్ర‌చారం చేశారు. రైతు బంధు కావాల్నా వ‌ద్దా..? అని ప్ర‌జ‌ల అభిప్రాయం తీసుకున్నారు. కాంగ్రెస్ వ‌స్తే.. రైతు బంధును బొంద‌పెడ‌తార‌ని వ్యాఖ్యానించారు. రైతు బంధు కావాలంటే.. కేసీఆర్‌ను గెలిపించుడు కాదు.. ముందు జాన్స‌న్ నాయ‌క్‌ను గెలిపించాల‌ని ఆయ‌న విన్న‌వించారు.

ఇక‌, పింఛ‌ను విష‌యంలోనూ.. గ‌త కాల‌పు లెక్క‌లు వ‌ల్లె వేశారు. 40 నుంచి 60 రూపాయ‌లు ఇచ్చిన స్థాయి నుంచి ఇప్పుడు రెండు వేల రూపాయ‌లు ఇస్తున్నామ‌ని చెప్పారు. పేద‌ల‌కు, వృద్ధులు, దివ్యాంగుల‌కు.. ఈ సొమ్ము అంతో ఇంతో మేలు చేస్తుంద‌ని ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతెందుకు ఇంతెందుకు అని గ‌తంలో ఎగ‌తాళి చేసింద‌ని విమ‌ర్శించారు. తాము తిరి గి అధికారంలోకి వ‌చ్చాక పింఛ‌న్‌ను రూ. 5000 చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణ‌లో మూడు గంట‌లు, 5 గంట‌లు క‌రెంటు ఇస్తామ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అదేమంటే 10 హెచ్‌పీ మోటార్లు పెట్టాల‌ని అంటున్నార‌ని.. అంత సొమ్ము రైతుల కాడ ఉండాల్నా.. వ‌ద్దా? అని ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వం ఇస్తున్న క‌రెంటుకు వంక‌లు పెడుతున్న‌వారు.. మేం 24 గంట‌లు కావాలా? వ‌ద్దా? అని అడుగుతుంటే.. ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌డం లేద‌న్నారు. రైతు బంధు కావాలంటే.. జాన్స‌న్ నాయ‌క్‌ను గెలిపించాల‌ని అన్నారు. మీ ఓటు మీ ఇష్టం అన్న కేసీఆర్ ఎవ‌రో చెప్పిన చెప్పిన‌ట్టు విన‌కండి అని పిలుపునిచ్చారు. మీరు చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on November 26, 2023 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

6 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago