తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్ ఎస్ విముక్త తెలంగా ణ లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. బీఆర్ ఎస్‌ను తరిమి కొట్టడమే లక్ష్యంగా ఇక్కడి ప్రజలు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అదేసమయంలో కేసీఆర్‌పైనా వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.. నన్ను తిడితే.. కేసీఆర్ సంతోషిస్తారని, పార్టీ చేసుకుంటారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కావాలని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దళితులకు చేసిందేమీ లేదని మోడీ దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందన్న మోడీ… బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దళితులకు చేసిందేమీ లేదన్నారు.
“బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కడే. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నా యి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ద్రోహ పార్టీలు, సమాజ విరోధులు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్‌కు వేసే ప్రతీ ఓటుతో బీఆర్‌ఎస్‌కు లబ్ధి. బీఆర్ఎస్‌ను హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణలో అన్ని వర్గాల లక్ష్యాలను నెరవేర్చడమే నా లక్ష్యం. మోడీని తిట్టడం అంటే కేసీఆర్‌కు ఇష్టం. ఆయన పార్టీ చేసుకుంటారు” అని ప్రధాని మోడీ అన్నారు. కాగా, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం గమనార్హం.
This post was last modified on November 25, 2023 11:39 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…