రాజకీయాలు రాజకీయాలే! అవి ఎవరివైనా కావొచ్చు. తెలగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారంలో జరుగుతున్న వ్యూహాలు.. సీఎం కేసీఆర్‌కు టెస్ట్ మ్యాచ్‌గా మారాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంగా ఉందనే టాక్ సర్వేల ద్వారా వినిపిస్తోంది. అలాగని .. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా.. పాజిటివ్ టాక్ లేదట.
అంతేకాదు.. ఆయా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి కొన్నిసూచనలు వస్తున్నాయి. మీరు బీఆర్ ఎస్‌లో ఉంటే గెలిపించే వాళ్లం! అంటూ.. ప్రజల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అలెర్టయిన కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు.. అయితే.. ఓకే.. కాంగ్రెస్‌లో గెలిపించండి.. ఆవెంటనే పార్టీ మారిపోతా! అని బిగ్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ ఎస్ నాయకులకు ఇబ్బంది ఏర్పడింది. బీఆర్ ఎస్ నేతల ఓటు బ్యాంకు ఇలాంటి కాంగ్రెస్ నేతలకు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీనిని పసిగట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. తర్వాత బీఆర్ ఎస్ లోకి వస్తామంటే.. ఎట్టి పరిస్థితిలోనూ వారిని చేర్చుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇలా.. తాము కాంగ్రెస్‌లో గెలిచినా బీఆర్ ఎస్‌లో చేరతామని.. చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మకుర్రి! అంటూ ఆయన ప్రకటన చేశారు.
“ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొత్త ప్రచారం షురూ చేసిన్రు. ఆ పార్టీ తరఫున ఎలానూ గెలవలేమని.. గుర్తించారు. అందుకే బీఆర్ ఎస్ పేరును వాడేసుకుంటున్నారు. తాము కాంగ్రెస్‌లో గెలిచినా.. రేపు బీఆర్ ఎస్‌లోనే చేరతామని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. ఈ మాటలు నమ్మకుర్రి. కాంగ్రెస్‌లో గెలిచిన వారికి.. బీఆర్ ఎస్‌లో కండువా కప్పేదేలేదు” అని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 25, 2023 4:33 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…