తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, వారికినోట్లు పంచి.. ఓట్లుకొనుగోలు చేయకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర పోలీసుల వరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అడుగడుగునా.. తనిఖీలు చేస్తున్నారు. ప్రతి కారును ఆపుతున్నారు. బైకులను కూడా నిలుపుతున్నారు. నిలువునా శీల పరీక్ష అన్నట్టు..అంగుళం అంగుళాన్ని కూడా తనిఖీ చేస్తూ.. అక్రమ నగదు తరలింపును అడ్డుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారనేది అనధికార సమాచారం.
అయినప్పటికీ.. ఈ నగదు తరలింపు మాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉంది. పోలీసులు, తనిఖీ అధికారుల కళ్లు గప్పి కోట్లకు కోట్లను తరలిస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా చోటు చేసుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. పోలీసుల తనిఖీలకు చిక్కకుండా కోట్ల రూపాయలను తరిలించేందుకు అక్రమార్కులు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఏకంగా మొత్తానికే మోసం తీసుకువచ్చింది. వారు తరలిస్తున్న కోట్ల రూపాయల సొమ్ముతో పాటు.. కారు కూడా కాలిపోయింది. దీంతో మరింతగా పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఏం జరిగింది?
ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు బానెట్‌లో నోట్ల కట్టలు పెట్టుకుని శుక్రవారం వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు బయల్దేరారు. బొల్లికుంట క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ కారును నిలిపివేసి పరారయ్యాడు. ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఇదంతా సినీఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది. ఇంతలో కారుకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ డబ్బు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఉన్న కొన్ని నోట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా దగ్ధమైన కారును మామునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. కారు, అందులోని నగదు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
This post was last modified on November 24, 2023 8:13 pm
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…