ఛీ.. ఛీ.. ఈ జనాలు మారరా? అంటూ.. నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. నిరుద్యోగిగా ఎదుర్కొన్న కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చిన యువతి శిరీష అలియాస్ బర్రెలక్క.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయంతెలిసిందే. మరిపెడకు చెందిన శిరీష.. సోషల్ మీడియాలో అందరికీ పరిచయమయ్యారు.
తన సమస్యను రాష్ట్రంతోపాటు దేశ ప్రజలందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఊహించని రీతిలో స్పందన రావడంతో.. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఏ మాత్రం జంకులేకుండా ప్రజా మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్న శిరీష కు పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఆమెకు ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నా.. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు.. పట్టణాల్లోప్రజలు మాత్రం ఇబ్బందులు సృష్టిస్తున్నారట.
ఈ విషయాన్నే బర్రెలక్క తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ప్రచారం చేస్తున్నా. కానీ.. నీకు ఓటేస్తే.. ఎంతిస్తావని అడుగుతున్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ఓటుకు 5000 ఇస్తున్నట్టు చెబుతున్నారు. నువ్వు కూడా అంతే ఇస్తావా? అని నిలదీస్తున్నారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు” అని బర్రెలక్క తన ఇంటర్వ్యూలో కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నో ఆశలతో నిరుద్యోగులకు, నియోజవకర్గానికి ఏదో మేలు చేయాలని తాను బరిలోకి దిగానని.. తన దగ్గర అంత డబ్బు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ప్రజలు తనను అర్ధం చేసుకోవాలని బర్రెలక్క విన్నవించారు. ఎంతో మంది నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. సంపాయించుకుంటున్నారని.. తాను సంపాయించుకునేందుకు ఎన్నికల్లో దిగలేదని.. నిజంగానే నియోజకవర్గానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చానని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలు ఇప్పటికైనా తనను అర్ధం చేసుకోవాలని కోరారు. ఈ ఇంటర్వ్యూను చూసిన నెటిజన్లు.. జనాలపై మండి పడుతున్నారు. నిస్వార్థంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువతిని ఇలా ఇబ్బంది పెడతారా? ఎంత సేపూ.. ఓట్లు అమ్ముకునే రాజకీయాలకే భుజం పడతారా? ఛీ .. ఛీ.. ఈ జనాలు మారరా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు.
This post was last modified on November 24, 2023 5:32 pm
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…