వివిధ కారణాలతో కేసీయార్ ప్రభుత్వం మీద తెలంగాణాలో చాలా వర్గాలు వ్యతిరేకంగా మారాయి. అయితే కేసీయార్ మీద మరో వర్గం ప్రత్యేకంగా మండిపోతోంది. ఈ వర్గం ఏమిటంటే గల్ఫ్ బాధిత కుటుంబాల వర్గం. తెలంగాణా నుండి గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య సుమారు 15 లక్షలుంటుంది. అక్కడ పనిచేసి తిరిగి వచ్చేసిన వాళ్ళ సంఖ్య మరో పది లక్షలుంటుది.
అంటే గల్ఫ్ దేశాలతో సంబంధాలున్న వాళ్ళు సుమారు 25 లక్షలు. తెలంగాణా మొత్తంమీద ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండే ఎక్కువమంది వెళ్ళారు, వెళుతున్నారు. గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చనిపోతున్న వాళ్ళని తిరిగి తెలంగాణాకు తీసుకురావటం పెద్ద సమస్యగా మారింది. గడచిన పదేళ్ళల్లో ఆ దేశాల నుండి తెలంగాణాకు వచ్చిన డెడ్ బాడీస్ సుమారు 2 వేలు. తెలంగాణాకు వచ్చేదారి లేక అక్కడే క్రిమేట్ అయిపోయిన బాడీస్ అంతకుమించి ఉన్నాయట.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2008లో కేసీయార్ వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాగా రెచ్చగొట్టారు. బాధిత కుటుంబాలకు ఇస్తున్న లక్ష రూపాయలను రు. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ బాధితుల కోసం రు. 500 కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అయితే తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, కేసీయార్ రెండుసార్లు సీఎం అయినా గల్ఫ్ దేశాల బాధితులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కేటీయార్, కల్వకుంట్ల కవిత కూడా వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు.
అందుకనే వేములవాడ, కోరుట్ల, సిరిసిల్ల, నిర్మల్, ధర్మపురి నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితుల కుటుంబాల సభ్యులే పోటీచేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏమిటంటే తాము గెలవటం కాదు. ఎంత అవకాశముంటే అంత బీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించటమే. వీళ్ళు పోటీచేస్తున్న ఐదు నియోజకవర్గాల్లో కేటీయార్ పోటీచేస్తున్న సిరిసిల్ల, కేసీయార్ పోటీచేస్తున్న కామారెడ్డి కూడా ఉంది. వీళ్ళ దెబ్బ కేటీయార్ మీద ఎంతుంటుందో తెలీదు కానీ కేసీయార్ మీద బలంగానే పడేట్లుంది. ఏ విషయమూ తేలాలంటే డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on November 23, 2023 12:00 pm
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…