అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర జోరందుకుంది. ఇప్పుడు జోరందుకోవటం ఏమిటో కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో బస్సుయాత్రలు చేస్తున్నారు కదాని అనుమానం రావటం సహజమే. కానీ ఇపుడు బస్సుయాత్రలు చేస్తున్నది రాజకీయ పార్టీల నేతలు కాదు. అచ్చంగా నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాల జేఏసీ నేతలు. కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు వివరించే ఉద్దేశ్యంతో నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నేతలు రెండు యాత్రలు మొదలుపెట్టారు. ఒక బస్సు ఉత్తర తెలంగాణాలో తిరుగుతుంటే, రెండో బస్సు దక్షిణ తెలంగాణాలో తిరుగుతోంది.
ఈనెల 16వ తేదీన మొదలైన బస్సులో విద్యార్ధి, నిరుద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రతి నియోజకవర్గంలోను తిరుగుతున్నారు. ప్రతిచోట జనాలతో మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. అలాగే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఏ విధంగా ఫెయిలైందో వివరించి చెబుతున్నారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూపు 1, 2 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను వివరిస్తున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల నిరుద్యోగులు ఎలా నష్టపోతున్నారో చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణా టూర్లో బస్సుయాత్ర ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. ఇక దక్షణి తలెంగాణా జిల్లాల్లో మొదలైన యాత్ర మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో పూర్తిచేసుకున్నది. ప్రతి ఊరిలోని లైట్రరీలు, స్టూడెంట్ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల దగ్గరుండే విద్యార్ధులతో జేఏసీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి లోకాన్ని చైతన్యపరుస్తున్నారు. మూడోసారి కేసీయార్ ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులకు ఎదురవ్వబోయే కష్ట, నష్టాల గురించి జేఏసీ నేతలు వివరంగా చెబుతున్నారు.
మరో మూడు రోజుల్లో రెండు బస్సులు మరికొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి 25వ తేదీ మధ్యాహ్నానికి హైదరాబాద్ కు చేరుకోవాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అవకాశముంటే హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున విద్యార్ధులు, నిరుద్యోగులతోనే ఒక సభ పెట్టే విషయాన్ని కూడా జేఏసీ నేతలు ఆలోచిస్తున్నారు. మొత్తానికి గ్రూప్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ పెద్ద ఇబ్బందిగా మారేటట్లుగా కనబడుతోంది. మరి విద్యార్ధి, నిరుద్యోగుల జేఏసీ పర్యటనల ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on November 23, 2023 10:31 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…