Political News

ఏపీలో రౌడీల రాజ్యం.. వ‌రంగ‌ల్‌ స్పూర్తితో త‌ట్టుకుంటున్నాం: ప‌వ‌న్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల‌లో పోటీ చేస్తున్న జ‌న‌సేన అభ్య‌ర్థుల త‌ర‌ఫున తొలిసారి ఆ పార్టీ చీఫ్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మైకు ప‌ట్టారు. వ‌రంగల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నిర్వ‌హించిన విజ‌య‌సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేందుకు వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని చెప్పారు.

ఇక‌, అంద‌రిలాగానే ప‌వ‌న్ కూడా సెంటిమెంటుకు ప్రాణం పోశారు. “తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలోనూ అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను” అని వ్యాఖ్యానించారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ త‌న‌కు పునర్ జన్మనిచ్చిందని చెప్పారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని, కానీ, ఇప్పుడు మాట్లాడాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావుల‌ను గెలిపించాలని కోరారు.

This post was last modified on November 22, 2023 7:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago