అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు.
ఇక, ఛత్తీస్‌గఢ్‌లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. మళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండదని అనుకున్నారో ఏమో.. అక్కడ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించలేదు. ఇక, ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లో ఈ నెల 25 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా పశు పోషకుల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.
దీనిలో ప్రధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.
1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు
2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.
3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు
4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్
5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు
6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ` హెల్త్ ఇన్సూరెన్స్
7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ పంపిణీ
This post was last modified on November 21, 2023 2:03 pm
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…