సాధారణంగా పదవిలో ఉన్న నాయకుడికి సెగ తప్పదు. మాకు ఇది చేయలేదు.. అది చేయలేదు.. అనే అసంతృప్తులు మామూలే. దీంతో ఆయా నాయకులు ఇతర సామాజిక వర్గాల మాట ఎలా ఉన్నా.. సొంత సామాజిక వర్గంపై ఆధారపడతారు. వారితో అయినా.. పాజిటివ్ ప్రచారం చేయించుకోవాలని భావిస్తారు. ఇక, ఆయా సామాజిక వర్గాలు కూడా పోన్లే.. మనోడే కదా.. తప్పులు ఎంత మంది చేయడం లేదని సర్దుకుపోయి.. ఎన్నికల సమయంలో సహకరించేందుకు ముందుకు వస్తాయి.
ఇది.. ఎక్కడైనా ఉన్నదే. అయితే.. అనూహ్యంగా వైసీపీకి చెందిన వివాదాస్పద ఎంపీ, హిందూపురం నాయ కుడు.. గోరంట్ల మాధవ్‌కు సొంత సామాజిక వర్గంలోనే సెగ పెరిగింది. అంతేకాదు.. ఇక నుంచి ఆయనను తమతో కలుపుకోవాలా? వద్దా? అనే విషయాన్ని కూడా.. వారు ఆలోచిస్తున్నారు. ఎంపీ మాధవ్ కురబ సామాజిక వర్గానికి చెందినవారు. అనంతపురంలో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అందుకే.. ఈ సామాజిక వర్గానికి చెందిన ఉష శ్రీచరణ్‌కు జగన్ మంత్రివర్గంలోనూ చోటిచ్చారు.
ఇంత ప్రాధాన్యం ఉన్న కురబ వర్గం.. ఇప్పుడు ఎంపీ విషయంలో కస్సుబుస్సులాడుతోంది. తమను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని.. తమలో తమకే చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని.. కురబ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అనంతపురంలో కురబ సామాజిక వర్గం ఘనంగా చేసుకునే పవిత్ర కార్యక్రమం గుడిమెట్ల ఉత్సవం
. దీనిని చాలా వైభవంగా చేసుకుంటారు. దీనిలో రాజకీయాలు చేయరు. కురబ వర్గానికి చెందిన వారు ఎవరున్నా.. పిలుస్తారు.
ఇలానే.. తాజాగా జరిగిన గుడిమెట్ల ఉత్సవానికి టీడీపీ నుంచి బీకే పార్థసారథిని కూడా పిలిచారు. అయితే.. ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎంపీ గోరంట్ల.. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ.. కురబలను అవమానించే రీతిలో వ్యవహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు.. స్టేజ్‌పైనే బీకే సారథిని కొట్టే ప్రయత్నం చేయడం.. మరింత వివాదంగా మారింది.
కొన్ని దశాబ్దాలుగా.. తాము కలిసి మెలిసి ఉంటున్నామని.. కానీ. ఎంపీ కారణంగా వైషమ్యాలు పెరుగుతున్నాయని కురబవర్గంఆరోపిస్తోంది. దీంతో ఎంపీని దూరం పెట్టాలని, ఆయనను ఇక నుంచి ఏ కార్యక్రమానికీ పిలవరాదని కూడా నిర్ణయించడం సంచలనంగా మారింది. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సొంత సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం ఎంపీకి సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on November 21, 2023 8:29 am
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…