యూట్యూబ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా సినిమానో.. లేక ఇతర కార్యక్రమాల్లో చూస్తున్నారని అనుకుందాం. సడెన్‌గా మధ్యలో యాడ్స్ రావడం కామన్. ఇవి 5 సెకన్లు గ్యారెంటీగా చూడాలి. కొన్ని కొన్ని సదరు యాడ్స్ అయ్యేవరకు చూడాలి. ఇలా యాడ్స్ ఇవ్వాలంటే.. నేరుగా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాలి. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. కోట్లలోనే ఉంటుందని అంటారు. ఇప్పుడు.. వైసీపీ కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుందని తెలుస్తోంది.
దాదాపు 300 కోట్ల రూపాయలతో యూట్యూబ్‌తో ఒప్పందం చేసుకున్నారని తాడేపల్లి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. గత 10 రోజులకుపైగా యూట్యూబ్‌లో వైసీపీ అధినేత జగన్ యాడ్స్ పెరిగిపోయాయి. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర కార్యక్రమాల గురించి అన్ని యూట్యూబ్ కార్యక్రమాల్లోనూ 10 సెకన్లకు తగ్గకుండా.. యాడ్ వస్తోంది. దీనిలో అన్నీ నేరుగా లైవ్ కార్యక్రమాలు.. కొన్ని ప్రజాభిప్రాయ సేకరణలు ఉంటున్నాయి.
మరికొన్ని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కూడా ఉంటున్నాయి. మొత్తంగా యూట్యూబ్‌లో వచ్చే కార్యక్రమాలు ఏవైనా కూడా మధ్యలో వైసీపీ యాడ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. వీటికి గాను ఆరు మాసాలకు ఒప్పందం జరిగిందని తాడేపల్లి వర్గాల నుంచి తెలుస్తున్న మాట. ఈ క్రమంలో మొత్తం 300 కోట్లను యూట్యూబ్‌కు ఒప్పందంగా చెల్లించారని అంటున్నారు.
ఎన్నికలకు వాస్తవంగా మరో 4 మాసాల గడువు ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడే.. ఇలా ప్రచారం ప్రారంభించడం.. అందునా.. 300 కోట్లతో ఒప్పందం చేసుకోవడం ఆశ్చర్యంగానే ఉందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కంపెనీ యాడ్స్‌కు ఒక రేటు ఉంటే.. పొలిటికల్ యాడ్స్‌కు మరో రేటు ఉంటుంది. ఎంతైనా ఫర్వాలేదనేలా వైసీపీ యాడ్స్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఇది.. ప్రజాధనమా? లేక పార్టీ ఫండా? అనేది సందేహమే!
This post was last modified on November 20, 2023 7:42 pm
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…