మధ్యలో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ మళ్ళీ ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయమై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లతో చర్చలు జరిపిన లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈనెల 24వ తేదీనుండే యువగళంతో లోకేష్ మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారట. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నపుడు చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టుచేసిన విషయం తెలిసిందే.
తండ్రి అరెస్టు విషయం తెలియగానే లోకేష్ పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేసి నంద్యాల చేరుకున్నారు. అప్పటినుండి దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర జరగలేదు. పాదయాత్రను లోకేష్ నిలిపేసినట్లు ప్రచారం కూడా జరిగింది. రిమాండులో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసమే లోకేష్ రెగ్యులర్ గా లాయర్లతో సమావేశాలు జరుపుతున్న కారణంగానే పాదయాత్రను కంటిన్యు చేయలేకపోయారు. అయితే 53 రోజుల రిమాండు తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే.
కంటి ఆపరేషన్ తదితర అనారోగ్యాల కారణంగా చంద్రబాబు మెడికల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆపరేషన్ తదితరాలను దగ్గరుండి చూసుకోవటంలో లోకేష్ బిజీ అయిపోయారు. అయితే పాదయాత్రను లోకేష్ నిలిపేయటంపై మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే సెటైర్లతో టార్గెట్ చేస్తున్నారు. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో పాదయాత్రను నిలిపేయటం కూడా ఒక ఇష్యూ అయ్యేట్లుందని లోకేష్ కు అనిపించినట్లుంది.
అందుకనే విమర్శకుల నోళ్ళు మూయించేందుకు ఈనెల 24వ తేదీ నుండి జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించారట. కాకపోతే ముందుగా అనుకున్నట్లు కాకుండా పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు చేయటంలేదు. ముందుగా వచ్చే వైజాగ్ నగరంలోనే ఆపేస్తారట. అంటే సుమారు పదిరోజులు పాదయాత్ర చేసి యువగళం పూర్తిచేసినట్లు ప్రకటిస్తారని పార్టీవర్గాల సమాచారం. యువగళం ముగింపు సందర్భంగా సభ నిర్వహించే విషయమై ఉత్తరాంధ్ర నేతలతో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత యువగళం పాదయాత్రపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on November 20, 2023 9:32 am
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…