టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు ఏపీ టీడీపీలో నేతల మధ్య జరుగుతున్న గుసగుస! గత 20 రోజులుగా నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత.. నారా లోకేష్ జాడ కనిపించలే దని పార్టీలోనే చర్చ సాగుతోంది. జనసేన-టీడీపీల పొత్తు ప్రకటన, తర్వాత.. సంయుక్త అజెండా రూపకల్పన, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చల వంటి ముఖ్య కార్యక్రమాల్లోనే నారా లోకేష్ పాల్గొన్నారు.
తర్వాత.. ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలం ట్విట్టర్‌లో పోస్టులు మాత్రమే పెడుతున్నారు. దీంతో నారా లోకేష్ ఏం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే పార్టీలో సాగుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పు డు.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో నారా లోకేష్ బిజీగా ప్రజల మధ్య ఉన్నారు. అదేసమయంలో న్యాయ పోరాటం కోసం.. న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీ-హైదరాబాద్ చుట్టూ కూడా తిరిగారు. ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఇక, ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం.. ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోవడం తెలిసిందే. అప్పటి వరకు ప్రధాన స్రవంతిలోనే నారా లోకేష్ .. అప్పటి నుంచి కనిపించడం లేదని పార్టీ నేతల మాట. మరో 9 రోజుల్లో చంద్రబాబుకు బెయిల్ గడువు తీరనుంది. మరి అప్పటి వరకు నారా లోకేష్ బయటకు రారా? ఆయన ఎలాంటిషెడ్యూల్ పాటిస్తున్నారనేది కూడా చర్చగానే ఉంది. అయితే.. ఇప్పటి వరకు నారా లోకేష్.. పార్టీ శ్రేణులకుఎలాంటి దిశానిర్దేశం చేయలేదు.
వాస్తవానికి.. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినా.. పెద్దగా.. నాయకులు ముందుకు సాగడం లేదు. మరోవైపు.. టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు కూడా ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు సర్దిచెప్పి.. పొత్తులను ఫలప్రదంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన నారా లోకేష్.. ఇప్పుడు మౌనంగా ఉండడంపై పార్టీలో అంతర్గత చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 20, 2023 8:59 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…