Political News

బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేద్దాం: అమిత్‌షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చేస్తున్న ప్ర‌చారానికి బూస్ట్ ఇస్తూ.. ఆ పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. గద్వాల నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వం పై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్‌కు వీఆర్ ఎస్ ఇచ్చే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని.. దీనికి అంద‌రూ రెడీ కావాల‌ని.. ఈ నెల 30న జ‌రిగే ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా ఓటేసి.. ఆ పార్టీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

“కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టు‌లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలే దు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తాం. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌న్న కేసీఆర్‌.. ఆ మాట‌నుఎందుకు త‌ప్పారో .. తెలంగాణ స‌మాజం త‌మ ఓటు ద్వారా నిల‌దీయాలి” అని అమిత్ షా అన్నారు.

జోగులాంబ శక్తి పీఠం కోసం మోడీ సర్కార్ 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని అమిత్ షా బీసీలకు బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. “టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. ప్రవళ్లిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సెప్టెంబ‌రు 17ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. ముస్లింల‌కు మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం” అని వ్యాఖ్యానించారు.

2-3-4 జీలు..

2జీ కేసీఆర్ – కేటీఆర్‌, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు విముక్తి కల్పించాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి మయంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని 70ఏళ్లు‌ నాన్చిందని విమ‌ర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలందరికీ అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామ‌ని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, ఇదే హామీని ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న చెప్పారు.

This post was last modified on November 18, 2023 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

23 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

58 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

10 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago