ఎన్నికలకు ఇక ఉన్నది 11 రోజులే కావటంతో అభ్యర్ధుల ప్రచారం ముమ్మరం చేశారు. 10వ తేదీవరకు నామినేషన్లకు సరిపోయింది. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎవరన్నది ఫైనల్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా అభ్యర్ధులందరు ఒక్కసారిగా ప్రచారంలో వేడిని పెంచేశారు. ఎప్పుడైతే అభ్యర్ధులు ప్రచారంలో వేడిని పెంచారో అప్పుడే కూలీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
పొలిటికల్ కూలీలకు డిమాండ్ ఎందుకు పెరిగిపోయిందంటే పార్టీలకు వాస్తవంగా మద్దతుదారులు తగ్గిపోతున్నారు కాబట్టే. ఒకపుడు పార్టీలకు బలమైన క్యాడర్ ఉండేది. పార్టీ సిద్ధాంతాలని, లేదా నేతలకు బలమైన మద్దతుదారులు చివరివరకు ఉండేవారు. కానీ ఇఫుడు పార్టీల్లో సిద్ధాంతాలన్నది ఎక్కడా కనబడటంలేదు. ఉన్నదంతా అధికారంపైన వ్యామోహం మాత్రమే. అందుకనే నేతలను బట్టే క్యాడర్ కూడా అలాగే మారిపోయారు. అందుకనే ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొనేందుకు పార్టీ కమిటెడ్ క్యాడర్ తక్కువైపోయారు. ఇక్కడే పెయిడ్ కూలీల అవసరం మొదలైంది.
ఇపుడు ఏ పార్టీ అభ్యర్ధి ప్రచారంలో చూసినా ఎక్కువగా పెయిడ్ కూలీలు అంటే పొలిటికల్ కూలీల సంఖ్యే ఎక్కువగా కనబడుతోంది. విచిత్రం ఏమిటంటే ఏ పార్టీలో చూసినా పొలిటికల్ కూలీలు దాదాపు ఒకటిగానే ఉంటున్నారు. ఉదయం ఒకపార్టీకి మధ్యాహ్నం మరో పార్టీకి రాత్రి మీటింగులకు కూడా వీళ్ళే ఎక్కువగా కనబడతున్నారు. వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళకు రోజుకు 700 రూపాయలు, బిర్యానీ, క్వార్టర్ మందు ఇస్తున్నాయి పార్టీలు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభలు పెరిగిపోతున్నాయి కాబట్టి వీళ్ళకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది.
పొలిటికల్ కూలీల్లో ఎక్కువగా పొలాల్లో పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. పొలాల్లో పనిచేసినా, భవన నిర్మాణంలో పనిచేసినా ఇక్కడ వస్తున్నకూలీ అంత రావటంలేదు. అందుకనే ఎక్కువగా ఎలక్షన్స్ లో బిజీ అయిపోయారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరిగే ఎన్నికల్లోనే వీళ్ళ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోందని సమాచారం.
ఈమధ్య షాదనగర్లో ఒక అభ్యర్ధి ప్రచారంలో పొలిటికల్ కూలీలను తలా రు. 400కి మాట్లాడుకున్నారట. అయితే అదే సమయంలో మరో అభ్యర్ధి బహిరంగసభ నిర్వహణలో జనాలు కావాల్సొచ్చిందట. దాంతో ఓ మూడొందలు ఎక్కవ ఇస్తానని కబురుచేయగానే ఈ పొలిటికల్ కూలీలంతా బహిరంగసభకు వెళ్ళిపోయారని టాక్. దీంతోనే వీళ్ళకి ఎంత డిమాండ్ పెరిగిపోతోందో అర్ధమవుతోంది.
This post was last modified on November 18, 2023 4:03 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…