వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని.. కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన పార్టీలు.. ఇప్పటికే దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఉమ్మడి మేనిఫెస్టోలపై సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇప్పించే హామీ కి పచ్చ జెండా ఊపారు. ఇక, నేతల మధ్య సమన్వయం పెంచే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు నేతల మధ్య సమన్వయం పెంచుతూనే.. మరోవైపు.. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగా శనివారం, ఆదివారం.. ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వాని కి వ్యతిరేకంగా కార్యక్రమాలు రెడీ చేసుకున్నారు. రహదారుల నిర్మాణం, రోడ్లపై గోతులువాటి ద్వారా ఏర్పడిన ప్రమాదాలు, పోయిన ప్రాణాలు.. వంటి అంశాలను తీసుకుని ఉమ్మడి నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నుంచి కీలక నాయకులు పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న రహదాలపై వినూత్న నిరసనలకు పార్టీలు రెండూ పిలుపునివ్వడంతో నాయకులు కూడా కలిసి రానున్నారు. అయితే… ఉమ్మడి కార్యాచరణలో ఇది తొలి ఘట్టమే. తర్వాత నుంచి వచ్చే రెండు మాసాల వరకు కూడా.. మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. ప్రస్తుతం చేపడుతున్న ఈ కార్యక్రమం వైసీపీపై ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఈ విషయాన్ని పరిశీలిస్తే.. నిజానికి రహదారులపై గోతులు, కొత్తరోడ్లు అనేది కొత్త అంశం కాదు. గతంలోనూ జనసేన రహదారుల దుస్థితిపై ఉద్యమాలు చేసింది. నేరుగా పవన్ ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించి.. రహదారులపై యుద్ధం ప్రకటించారు. టీడీపీ కూడా గతంలో రోడ్ల దుస్థితిపై నిరసనలు వ్యక్తం చేసింది. అయితే.. ఎన్నికల ఉమ్మడి ప్రణాళికలో దీనిని తొలిభాగం చేశారు. ఏదేమైనా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రంతరం చేస్తున్న నేపథ్యంలో సహజంగానే వైసీపీపై ప్రభావం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on November 18, 2023 3:59 pm
వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…