రైతుబంధు పథకం పేరుతో కేసీయార్ వేసిన ప్లాన్ రివర్సు కొట్టినట్లే ఉంది. విషయం ఏమిటంటే 2018 ఎన్నికల నాటి రైతు రుణమాఫీ హామీని కేసీయార్ ఇప్పటికీ సంపూర్ణంగా అమలుచేయలేదు. రాబోయే ఎన్నికల్లో రైతులు ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లేస్తారో అన్న భయంతోనే హడావుడిగా రైతురుణమాఫీని మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి ఇంకా సుమారు 20 లక్షల రైతుల ఖాతాల్లో రు. 8 వేల కోట్లు పడాలి. ఖజానాలో డబ్బుల్లేవు, సమీకరణ సాధ్యంకాలేదు. అందుకనే ఎన్నికల షెడ్యూలని కొంతకాలం కాలక్షేపం చేశారు.
ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత డ్రామా మొదలుపెట్టారు. అదేమిటంటే రైతురుణమాఫీ పథకంలో రైతులకు డబ్బులు వేయాలని కాబట్టి తమకు అనుమతి ఇవ్వాలని కేసీయార్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు. కేసీయార్ ఉద్దేశ్యం ఏమిటంటే కమీషన్ ఎలాగూ అనుమతించదని. అప్పుడు తాము డబ్బులు వేయటానికి రెడీగా ఉన్నా కమీషన్ అడ్డుపడటం వల్లే ఖాతాల్లో డబ్బులు జమచేయలేకపోయామని చెప్పకోవటమే. అందుకనే కమీషన్ ఒప్పుకుంటే వెంటనే డబ్బులు వేస్తామని, ఒప్పుకోకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తామని గతంలోనే ప్రకటించింది.
అయితే కమీషన్ ఏమిచేసిందంటే రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో ఏ రోజు వేస్తారో చెప్పమని ప్రభుత్వాన్ని అడిగింది. కమీషన్ రాసిన లేఖకు ఇంతవరకు ప్రభుత్వం నుండి సమాధానం వెళ్ళలేదు. ఎందుకంటే అసలు రుణమాఫీ చేయటానికి ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు కాబట్టి. ఏదో కమీషన్ మీద తోసేసి కొద్దిరోజులు డ్రామాలాడాలని కేసీయార్ అనుకున్నారంతే. ఆ డ్రామాను ఎన్నికల కమీషన్ చిత్తుచేసింది.
రైతుబంధుకు వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ లేఖరాసింది కాబట్టే పథకాన్ని అమలుచేయలేకపోతున్నట్లు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కొద్దిరోజులు ఆరోపణలతో కాలక్షేపం చేశారు. దానికి కాంగ్రెస్ గట్టిగా రివర్సులో తగులుకున్నది. తాము కమీషన్ కు రాసినట్లు చెబుతున్న లేఖను బయబపెట్టమని అడిగేసరికి మాట్లాడలేదు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేద్దామని, ప్రత్యర్ధిపార్టీలపై బురదచల్లటమే కేసీయార్ అండ్ కో టార్గెట్ పెట్టుకున్నారు. తమ చేతకాని తనాన్ని కూడా ఎదుటివాళ్ళమీద తోసేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటే ఎంతకాలం సాగుతుంది ?
This post was last modified on November 18, 2023 2:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…