Political News

రేవంత్ రెడ్డి ‘డిసెంబ‌రు-9’ సెంటిమెంట్ విన్నారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ర‌క‌ర‌కాల సెంటిమెంట్ల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. కొంద‌రు తెలంగాణ ఇచ్చింది తామేన‌ని త‌మ‌కు ఓటేయాల‌ని కోరుతున్నారు. మ‌రికొంద‌రు సోనియ‌మ్మ గ్యారెంటీలు అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఇంకొంద‌రు.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పాల‌న‌ను చూపిస్తున్నారు. మొత్తానికి ఈ సెంటిమెంట్లు ఓ రేంజ్‌లో పారిస్తున్నారు. ఏం చేసినా.. ఓట‌రు దేవుడి అనుగ్ర‌హం కోస‌మే క‌దా!

ఈ ప‌రంప‌రలో కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌రికొత్త సెంటిమెంటు అస్త్రాన్ని ప్ర‌యోగించారు. అదే డిసెంబ‌రు-9. త‌న‌కు డిసెంబ‌రు-9 సెంటిమెంటు అంటూ.. రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వ‌చ్చే నెల డిసెంబ‌రు – 9న అద్భుతం జ‌ర‌గ‌డబోతోంద‌ని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంద‌ని చెప్పారు. డిసెంబ‌రు 3 న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో డిసెంబ‌రు-9న కాంగ్రెస్ సీఎం ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు.

దీనికి సంబంధించి కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా రేవంత్ వెల్ల‌డించారు. “గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా నా నియామ‌కం జ‌రిగింది. నేను డిసెంబ‌రు 9న ప‌గ్గాలు చేప‌ట్టాను. కాలం క‌లిసి వ‌చ్చింది. కాంగ్రెస్ పుంజుకుంది. నేత‌ల మ‌ధ్య వివాదాలు త‌గ్గాయి. క‌లిసి పోరాటం చేస్తున్నారు. ఇక‌, 2009, డిసెంబ‌రు 9న చిదంబ‌రం(అప్ప‌టి కేంద్ర మంత్రి) తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించారు. ఇది సాకార‌మైంది. ఇక‌, మా అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబ‌రు -9. కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన త‌ర్వాత‌.. తొలిసారి గాంధీ భ‌వ‌న్‌లో అడుగు పెట్టింది కూడా డిసెంబ‌రు-9నే. కాబ‌ట్టి.. ఈ సెంటిమెంట్ మ‌ళ్లీ రిపీట్ అవుతుంది. డిసెంబ‌రు-9 కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది” అని రేవంత్ చెప్పారు.

This post was last modified on November 17, 2023 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

10 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

12 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

12 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

13 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

14 hours ago