తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు గెలుపు గుర్రం ఎక్కేందుకు నానా ప్రయాస పడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. అయితే.. ఎక్కడో తేడా అయితే కొడుతోంది. భారీ ఎత్తున పోటీ ఉండడం.. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌కు, ఈ రెండు పార్టీల నుంచి బీజేపీకి సెగ పెరు గుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు సెంటిమెంట్లు అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మరి వాటికి తెలంగాణ ఓటర్లు ఫిదా అవుతారా? లేదా? అనేది తేలాలంటే.. డిసెంబరు 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
లాస్ట్ చాన్స్ ప్లీజ్
పోటీలో ఉన్న కొందరు నాయకులు ఇదే తమకు లాస్ట్ చాన్స్ అని… వచ్చే ఎన్నికల నాటికి తాము రిటైర్ అవుతామని ప్రజలకు చెబుతున్నారు. వీరిలో మంత్రి మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా.. “ఇదే లాస్ట్ చాన్స్ బిడ్డా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నాకు వారసులు కూడా లేరు. ఇక మీ ఇష్టం” అంటున్నారు. ఇక, ఇదే అంశాన్ని మాజీ ఎమ్మెల్యే, నటుడు బాబూ మోహన్ కూడా ప్రయోగిస్తున్నారు. ఆందోల్ నియోజకవర్గంలో ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో ఇదే తనకు లాస్ట్ చాన్స్ అని.. ప్రజలు అర్థం చేసుకుని గెలిపించాలని ఆయన కోరుతున్నారు.
లోకల్-నాన్ లోకల్
చాలా నియోజకవర్గాల్లో ఇది ఎక్కువగా వినిపిస్తున్న మాట. పాలేరు సహా కామారెడ్డి, గజ్వేల్‌లో పోటీలో ఉన్న కీలక నాయకులకు నాన్ లోకల్ సెంటిమెంటు ఎక్కువగా తగులుతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ ఆయన నాన్‌లోకల్ నాయకుడు అంటూ.. ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయన ఇక్కడకు వచ్చి.. తన అమ్మమ్మ ఇక్కడి ప్రాంతానికి చెందినవారేనని చెప్పుకోవాల్సి వచ్చింది. పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా.. నాన్ లోకల్ సెగ ఎక్కువగా ఉంది. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌కు కూడా నాన్‌లోకల్ అనే ముద్ర పడింది. అయితే.. ఈయన కూడా తనకు ఇక్కడ బంధం ఉందని వివరించుకున్నారు.
మహిళా సానుభూతి
గద్వాల్, ఖైరతాబాద్ సహా ఘన్‌పూర్, కోదాడ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకులు పోటీ చేస్తున్నారు. అయితే.. వీరికి పురుష అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో వీరు మహిళా సెంటిమెంటును, సానుభూతిని తెరమీదికి తెస్తున్నారు. మహిళలను ఎక్కువగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా.. అనేక రూపాల్లో సెంటిమెంట్లు పండుతున్నాయి. మరి ఓటరు మహాశయడు ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 3:39 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…