కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ దారికొచ్చినట్లేనా ? గ్రౌండ్ లెవల్లో వ్యవహారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి నామినేషన్లు వేసిన కొందరు తిరుగుబాటు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు సరే మరి అభ్యర్ధుల గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారా ? అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. నామినేషన్లను ఉపసంహరించుకున్న సీనియర్ నేతలు సుమారు 12 మందున్నారు.
సూర్యాపేటలో రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఏఐసీసీ తరపున రోహిత్ చౌదరి, మల్లురవి తదితరులు వెళ్ళి బుజ్జగించారు. దాంతో దామోదర్ రెడ్డి గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడలో కాసుల బాలరాజు కూడా నామినేషన్ వేశారు. అయితే పార్టీలోని పెద్దల చర్చలతో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అలాగే జుక్కల్ లో గంగారామ్, వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ లో నెహ్రూనాయక్, ఇంబ్రహింపట్నంలో దండెం రామిరెడ్డి కూడా నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
అయితే ఆదిలాబాద్ నుండి సంజీవరెడ్డి మాత్రం నామినేషన్ ఉపసంహరించుకోలేదు. నామినేషన్ ఉపసంహరించుకున్న రమేష్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా టికెట్ ఖాయమైందని అంటున్నారు. అలాగే అద్దంకి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ హామీ దక్కిందని చెబుతున్నారు. అధిష్టానం మాట మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న వాళ్ళకి జిల్లాల పార్టీ అధ్యక్షులుగాను, నామినేటెడ్ పోస్టులు, ఎంఎల్సీలను హామీ ఇచ్చారు. మరికొందరికి ఎంపీ టికెట్లు కూడా హామీలిచ్చారు.
మొత్తంమీద 24 మంది తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు వేస్తే ఇందులో 12 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఉపసంహరణలకు అవకాశం దాటిపోయిన కారణంగా అభ్యర్ధులకు మద్దతుగా పనిచేయాలని పార్టీ నేతలు అడుగుతున్నారు. ఈ నేపధ్యంలోనే బుజ్జగింపుల పర్వం జరుగుతోంది. అధిష్టానం తరపున తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు రెబల్స్ తో మాట్లాడుతున్నారు. కొందరేమో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, మరికొందరేమో పోటీలోనే ఉన్నారు. మొత్తంమీద వీళ్ళంతా అభ్యర్ధుల గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.
This post was last modified on November 17, 2023 9:44 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…