Political News

కేటీఆర్ నన్ను తిడితే… నేను కేసీఆర్ ను తిడతా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస మర్యాద ఇవ్వకుండా అదే పనిగా నోరు పారేసుకుంటున్నారంటూ టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్.. హరీశ్ అండ్ కో విరుచుకుపడటం తెలిసిందే. వయసులో పెద్దవాడైన ముఖ్యమంత్రిని పట్టుకొని అన్నేసి మాటలు ఎలా అంటారు? అంటూ రేవంత్ పై విరుచుకుపడే వారికి మళ్లీ నోట మాట రాకుండా సమాధానం ఇచ్చేశారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. తనపై వస్తున్న విమర్శలకు ఎవరు కాదనలేని సమాధానం ఇవ్వటమే కాదు.. మంత్రి కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఆయన చెప్పిన వివరణ ఆకర్షించేలా ఉండటం గమనార్హం. అంతేకాదు.. రేవంత్ మాటల్లో వినయం.. విధేయత ఆకట్టుకునేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇంతకూ రేవంత్ ఏమన్నారంటే.. “కేటీఆర్ కంటే నేను చాలా పెద్దోడ్ని సార్. నా ముందు బచ్చాగాడు. అనుభవంలో పెద్దోడ్ని. కేటీఆర్ నిక్కర్లు వేసుకునేటప్పుడు నేను జూబ్లీహిల్స్ సొసైటీకి కన్వీనర్ ను. నేను పెళ్లి చేసుకునేటప్పుడు కేటీఆర్ నిక్కర్లు వేసుకొని స్కూల్ కు వెళ్లేటోడు. కేటీఆర్ నన్ను.. వాడు.. వీడు.. దొంగ.. లుచ్చా అని అనొచ్చా? కేటీఆర్ కు నాకు మధ్య ఎంత గ్యాప్ ఉందో.. నాకూ కేసీఆర్ కు అంతే వయసు గ్యాప్ ఉంది. నన్ను కేటీఆర్ అంటే.. నేను కేటీఆర్ ను ఎందుకు అంటాను. వాళ్ల నాయనను అంటా. ఈ మాత్రం తత్త్వం కేటీఆర్ కు బోధపడొద్దా?” అని ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎంత పెద్దదో తెలిసిందే. 2006లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీ.. 2007 ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ.. 2009 ఎమ్మెల్యే.. 2014 ఎమ్మెల్యే.. 2019లో ఎంపీ. కేటీఆర్ 2009, 2014, 2018లోనే ఎమ్మెల్యే. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ల నాన్న ఉన్నాడు కాబట్టి. ఏరకంగా నాకు.. కేటీఆర్ కు పోలిక? కేటీఆర్ నన్ను వాడు.. వీడు అనొచ్చా? వాళ్లకు అహంకారం.. బలుపు.. ఎవరన్నా లెక్కలేనితనం.. జైసాల్ రెడ్డిని.. జానారెడ్డిని కేటీఆర్ ఎట్లా మాట్లాడిండు మీరందరికి తెలుసు. కేసీఆర్ కొడుకును పిలిచి చెప్పాలి కదా? అరే.. మనం అంటే మనల్ని కూడా అంటారని. జాగ్రత్తగా ఉండాలి. మనం అధికారంలో ఉన్నాం.. ఒద్దికగా ఉండాలని చెప్పాలిగా. బాధ్యతగా ఉండాలని చెప్పాలి కదా? ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు కాస్త ఆవేశం ఉంటుంది. వాళ్లే అలా మార్చేశారు” అని పేర్కొన్నారు.

పెద్దలు జానారెడ్డిగారు పెద్దరికంగా మాట్లాడుతుంటే.. ఆయనపట్ల ఎలాంటి భాష వాడారో తెలుసు కదా అని ప్రశ్నించిన రేవంత్.. “మనం కూడా అలానే మాట్లాడితే వాళ్లు ఊరుకుంటారా? మనం ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లినప్పుడు ఒకడు చేత్తో ఆడుతుంటే.. ఒకడు కాల్తో ఆడితే చూస్తారా? అలానే సేమ్. వాళ్లు నలుగురు వస్తున్నారు. నేను ఒక్కడ్ని పోతున్నా” అంటూ తన ఆవేశపూరిత వ్యాఖ్యలపై రేవంత్ క్లారిటీ ఇచ్చేశారు. ఆయన మాటలు విన్న తర్వాత.. ఈ రచ్చ మొదలు పెట్టిన కేటీఆర్ పై వేలెత్తి చూపిన వైనం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చగా మారింది.

This post was last modified on November 17, 2023 9:38 am

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

15 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

6 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

6 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

6 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago