అయిదేళ్ల పాటు ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికి, పదవిలో కొనసాగేందుకు ఆరాటపడుతున్న నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాయకులు కష్టపడే సమయం ఇదే. మరోవైపు ఓటర్లు, ప్రజలు తమ డిమాండ్లను నెరవేర్చుకునే సమయం కూడా ఇదే. ఎందుకంటే ఈ సమయంలో ఓట్ల కోసం ఏది అడిగినా నో అని చెప్పకుండా నాయకులు చేస్తుంటారు. ఇప్పుడదే బాటలో నగరాల్లోని అపార్ట్ మెంట్ ఓటర్లు సాగుతూ.. తమ డిమాండ్లను బయట పెడుతున్నారు. వీటిని తీర్చలేక నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిసింది.
ఓ వైపు సభలు, ర్యాలీలతో బయట ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు.. అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రజలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయా అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులతో చర్చిస్తూ.. ఆయా అపార్ట్ మెంట్లలోని ఓట్లు మొత్తం తమకే దక్కేలా చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారని తెలిసింది. అయితే ఇదే అదనుగా అపార్ట్ మెంట్ ప్రతినిధులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని టాక్. అపార్ట్ మెంట్లో సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఖర్చులు భరించాలని అభ్యర్థులకు చెబుతున్నట్లు తెలిసింది.
ఒక అపార్ట్ మెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరో దాంట్లో సోలార్ పవర్ కోసం అయ్యే ఖర్చు భరించాలని ఇలా అపార్ట్ మెంట్ ప్రతినిధులు అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఈ ఖర్చు భరించేందుకు ఆయా నేతలు ముందుకు వొస్తున్నా వీళ్లలో మరో అనుమానం నెలకొంది. తీరా పని పూర్తయ్యాక ఆ అపార్ట్ మెంట్ లోని అందరూ తమకే ఓటు వేస్తారనే గ్యారెంటీ ఏముందని అనుకుంటున్నారు. అందుకే అపార్ట్ మెంట్ వాసుల ఓట్ల కోసం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నారని తెలిసింది.
This post was last modified on November 16, 2023 7:35 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…