తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్వతంత్రులు, రెబల్స్ బెడద జోరుగా ఉంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు 1057 మంది పోటీ చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధవారం) మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లను వెనక్కి తీసుకున్నా..గత ఎన్నికలతో పోల్చుకుంటే పోటీ చేసేవారు ఎక్కువగా ఉన్నారని సంఘం తెలిపింది.
ఎక్కడెక్కడ ఎంత మంది అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బుధవారం 608 మంది అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
మెజారిటీపై దెబ్బ!
ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని అభ్యర్థులు కలవరపడుతుండడం గమనార్హం.
This post was last modified on November 16, 2023 2:27 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…