తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారై నెల రోజులు కావస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్లాగే ఈ రెండు పార్టీల మద్దతుదారులు వాదోపవాదాలు, గొడవలతో గడిపేస్తున్నారు కానీ.. గ్రౌండ్ లెవెల్లో కొంత సమన్వయంతోనే సాగిపోతున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. రెండు పార్టీల మధ్య వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమం కొంత రసాభాసగా జరిగింది కానీ.. తాజాగా హిందూపురంలో మాత్రం టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం ఎంతో కలివిడిగా, ఆహ్లాదభరిత వాతావరణం మధ్య జరిగింది.
ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కావడం విశేషం. ఆయన ఇరు పార్టీల మధ్య సోదర భావం నెలకొనేలా వ్యవహరించారు. ఆయన ప్రసంగం కూడా అందుకు తగ్గట్లే సాగింది.
ఈ కార్యక్రమానికి బాలయ్య టీడీపీతో పాటు జనసేన కండువా కూడా వేసుకుని హాజరు కావడం విశేషం. పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న జనసేన కండువానే అందులో బాగా హైలైట్ అయింది. తన ప్రసంగం చివర్లో బాలయ్య పవన్‌కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు జై జనసేన అంటూ నినాదం కూడా చేయడం విశేషం.
“బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. ఈ యజ్ఞంలో ఒక సమిధ కావడానికి ఆయనంతట ఆయన సిద్ధంగా ఉన్నందుకు.. ఆయన అనుచరగణం.. ఎవరైతే ఉన్నారో అందరూ జనసైనికులు అందరూ అయితేనేమి వాళ్లు ఒక మాట మీద నిలబడి ఇలా మాకు ముందుకు వెళ్తూ, ఉద్యమిస్తూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి జరిగిన ఈ కలయిక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.. జై తెలుగుదేశం.. జై జనసేన” అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 16, 2023 2:34 pm
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద…
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి…
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ…