Political News

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు “బీఆర్ ఎస్‌” మొహ‌మాటం

అదేంటి? అనుకుంటున్నారా? నిజ‌మే. ఎన్నిక‌ల వేళ‌.. టికెట్ ద‌క్క‌లేద‌ని అలిగి కొంద‌రు నాయ‌కులు బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ వెంట‌నే కాంగ్రెస్ కండువా క‌ప్పుకొని ఆ పార్టీ టికెట్ సొంతం చేసుకున్నారు. మొత్తానికి టికెట్ అయితే ద‌క్కింది. ప్ర‌చారం కూడా ప్రారంభించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయ‌లేక‌పోతున్నార‌ట‌.

అంతేకాదు.. బీఆర్ ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ విధానాల‌ను ఎండ‌గ‌డుతుంటే.. కాంగ్రెస్ త‌ర‌ఫున బీఆర్ ఎస్ రెబ‌ల్‌గా ఉన్న వారు పోటీ చేస్తున్న స్థానాల్లో బీఆర్ ఎస్‌ను ప‌న్నెత్తు మాట అన‌లేక పోతున్నారట‌. అంతేకా దు.. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను అస్స‌లే ఏమీ అనే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని వారి వారి అనుచ‌రులే చెబుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌లో ప్ర‌చారం నిమిత్తం రెడీ చేసుకుంటున్న స్క్రిప్టుల్లో బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ లు లేవు. కేసీఆర్‌టార్గెట్ లేదు. కేటీఆర్‌ను ఒక్క మాట కూడా అన‌డం లేదు.

దీంతో కొంద‌రు కాంగ్రెస్ అభ్య‌ర్థుల ప్ర‌చారం చ‌ప్ప‌గా సాగుతోందని స‌ర్వేలు చెబుతున్నాయి. దీనికి కార‌ణా లు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఒక‌టి గ‌తంలో బీఆర్ ఎస్‌లో ఉండ‌గా కొంద‌రు నాయ‌కులు కాంట్రాక్టులు పొందారు. అదేవిధంగా కేసీఆర్ నుంచి ఆర్తిక సాయం కూడా పొందారు. వారివారికి స్థానిక సంస్త‌ల్లోనూ ప‌దవులు ఇప్పించుకున్నారు. ఇక‌, కుటుంబాల‌కు కూడా సాయం చేయించుకున్నారు. కొంద‌రు సొంత ఇళ్ల కోసం స్థ‌లాలు తీసుకున్నారు.

మొత్తంగా బీఆర్ ఎస్‌లో ఉండ‌గా.. కొన్ని ల‌బ్ధిలు పొందారు. ఈ ప‌రిణామం ఇప్పుడు వీరికి మొహమాటంగా మారింది. దీంతో ప‌న్నెత్తు విమ‌ర్శ చేయ‌డానికి మ‌న‌సు రావ‌డం లేదట‌. దీనిలో మ‌రో కోణం కూడా ఉంద ని చెబుతున్నారు. రేపు ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే.. త‌మ‌ను బీఆర్ ఎస్ అధినేత టార్గెట్ చేయొచ్చ‌నే జంకు కూడా ఈ నాయ‌కుల్లో క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అందుకే ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేరుగా టార్గెట్ చేయ‌లేక స‌త‌మ‌తం అవుతున్నార‌ని అంటున్నారు.

This post was last modified on November 16, 2023 1:41 pm

Share

Recent Posts

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

44 minutes ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

5 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

6 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

7 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

9 hours ago