టీడీపీ నాయకుడు, కడప జిల్లా పులివెందుల పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి(రవీంద్రారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పులివెందుల మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరిచారు. అయితే.. దీనికి ముందు భారీ హైడ్రామా చోటు చేసుకుంది. బీటెక్ రవిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. కొందరు మీడియాకు ఉప్పందించారు. దీంతో మీడియాలో బీటెక్ రవి కిడ్నాప్ అంటూ.. భారీ ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. కడప నుంచి పులివెందుల వస్తుండగా బీటెక్ రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారని వార్తలు వచ్చాయి.
దీంతో ఈ విషయం తెలుసుకున్న రవి సతీమణి భయాందోళనకు గురై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రవికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు తెలియదని పోలీసులు చేతులెత్తేశారని టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యానించారు. దీంతో రవిని తీసుకెళ్లిందెవరు..? అసలేం జరిగింది..? అనేది తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాజకీయంగా ఆయన శత్రువులే కిడ్నాప్ పనిచేశారా..? లేకుంటే అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారా..? అనేది కొద్దిసేపు చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఈ విషయం ఇలా జరుగుతున్న క్రమంలోనే మరోవైపు.. బీటెక్ రవిని పులివెందుల పోలీసులే దారి కాచి అరెస్టు చేశారని తెలిసింది. అయితే.. పోలీసులు అరెస్టు చేశారంటే.. టీడీపీ నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో ఆయన అరెస్టును కొన్ని గంటల పాటు నిలిపి ఉంచారు. ఇంతలోనే ఆయన కిడ్నాప్ అయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే.. పోలీసులు రవిపై సెక్షన్ 333(ఐపీసీ) కింద అరెస్టు చేసినట్టు చెప్పారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఏంటి కేసు?
గతంలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేశారని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసి ఉంటారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
లోకేష్ రియాక్షన్
పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం పులివెందుల వెళ్లాల్సి వచ్చినా సీఎం జగన్ గజ గజా వణుకుతున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత లాంటివి.. చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని విమర్శించారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్ అని ఆక్షేపించారు. తన ఎన్నికల ప్రత్యర్థి(పులివెందుల) బీటెక్ రవిని చూసినా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 15, 2023 6:34 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…