తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ల మధ్య గ్యాప్ ఉందని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తర్వాత సీఎం రేసులో హరీష్ రావు ఉన్నారని, కానీ, కేటీఆర్ రాకతో ఆయన ఆశలకు గండిపడిందని పుకార్లు వచ్చాయి. ఇక, హరీష్ రావు సొంత కుంపటి కూడా పెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత బావాబామ్మర్దులు పలు సందర్భాల్లో తమ మధ్య గ్యాప్ లేదని క్లారిటీనిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ గురించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని హరీష్ రావు అన్నారు. పదవులకంటే వ్యక్తిత్వం గొప్పదని, కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. కేటీఆర్ ని ను ముఖ్యమంత్రిగా చేస్తే తనకు అభ్యంతరం ఏమీ లేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేతలది అవగాహనారాహిత్యమని, అందుకే గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 2 పంటలు వేస్తుంది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు మంచి పేరు వచ్చిందనే లక్ష కోట్ల అవినీతి అంటూ రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో ఆ పార్టీ నేతలు కమీషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన రాహుల్ జోకర్ అయిపోయారని ఎద్దేవా చేశారు.
This post was last modified on November 14, 2023 10:04 pm
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల…