దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతం వెనుకబాటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరున్న పల్నాడు ఆ తర్వాత ఆ మచ్చను చెరిపేసుకుంది. కానీ, కరువు కోరల నుంచి మాత్రం బయటపడలేదు. ముఖ్యంగా తాగు, సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎగువ పల్నాడు ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. నాగార్జునసాగర్ డ్యాం ద్వారా వచ్చే నీటితో దిగువ పల్నాడులో నీటి ఎద్దడి తగ్గింది. దీంతో, ఎగువ పల్నాడు ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు 70 ఏళ్ల క్రితం వరికపూడిసెల ప్రాజెక్టును ప్రతిపాదించారు.
అయితే, గత 7 దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి శిలా ఫలకాలు వేశాయి. కానీ, ప్రాజెక్టుకు కావాల్సిన పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తేవడంలో మాత్రం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్రం నుంచి తెచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 15వ తారీకున వరికిపూడిసెల ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు.
మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్న గంగలకుంట గ్రామం వద్ద వరికిపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. 350 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని వెల్దుర్తి ప్రజల దాహార్తిని తీర్చేందుకు విడుదల చేయాలని సంకల్పించారు. దాంతోపాటు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం పంపు హౌస్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. సీఎం జగన్ చొరవతో అటవీ శాఖ, పర్యావరణ అనుమతులు లభించాయని, ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
70 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి అక్కడ ఎన్నో ప్రభుత్వాలు శంకుస్థాపన కూడా చేశాయి. కానీ, అనుమతులు సాధించడంలో మాత్రం విఫలమయ్యాయి. కాగా, ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి మాచర్లకు చేరుకోనున్నారు. శంకుస్థాపన, బహిరంగ సభ ముగించుకొని మాచర్ల నుంచి తాడేపల్లికి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
This post was last modified on November 14, 2023 9:49 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…