కేసీయార్ పాలన పై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యాడ్స్ తో బీఆర్ఎస్ కు బాగా మండుతున్నట్లే ఉంది. కాంగ్రెస్ యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిందంటేనే బీఆర్ఎస్ కు ఎంతగా మండుతోందో అర్ధమవుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ జారీ చేసిన ప్రకటనల్లో కొన్నింటిపై కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తచేసింది. మొత్తంమీద రెండుపార్టీలు పరస్పరం జారీచేసుకున్న యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికలకమీషనర్ కు ఫిర్యాదులు చేసుకోవటమే హైలైట్ గా నిలిచింది.
ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్ పోలికలతో ఎవరినో ప్రధానంగా ఉంచి కాంగ్రెస్ కొన్ని యాడ్స్ తయారుచేసింది. సుమారు ఐదారు యాడ్స్ జనాల్లో బాగా వైరల్ అయ్యాయి. కేసీయార్ పోలికలున్న వ్యక్తి జనాలతో మాట్లాడటం, జనాలు సదరు వ్యక్తి హామీలను తిరస్కరించటం, కారుకు పంక్చర్ చేయటం, కారును మద్దతుదారులతో కేసీయార్ పోలిన వ్యక్తి తోసుకుంటూ వెళ్ళటం లాంటివి యాడ్స్ లో కనబడుతున్నాయి. కాంగ్రెస్ విడుదల చేసిన ఈ యాడ్స్ కాస్త వెరైటీగా ఉండటంతో జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి.
అసలే కేసీయార్ పాలనపై మండిపోతున్న జనాలను ఈ యాడ్స్ బాగా ఆకర్షించాయి. దాంతో సోషల్ మీడియాలో ఈ యాడ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాల్లో ట్రెండ్ అవుతున్న కేసీయార్ యాంటీ యాడ్స్ ను చూసి బీఆర్ఎస్ లో కలవరం మొదలైనట్లే ఉంది. యాడ్స్ కారణంగా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతే పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో అనే భయం కూడా పెరిగిపోయినట్లుంది. అందుకనే కాంగ్రెస్ జారీచేసిన యాడ్స్ ను వెంటనే నిలిపేయాలని అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
ఇదే విధమైన అభ్యంతరాలను కాంగ్రెస్ కూడా వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇచ్చిన యాడ్స్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే గడచిన పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉండటంతో పార్టీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ కు ఏమీలేదు. అందుకనే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనను, కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీ హామీలను విమర్శిస్తు బీఆర్ఎస్ యాడ్స్ ఉన్నాయి. అయితే సిక్స్ గ్యాంరెటీస్ ఇప్పటికే జనాల్లో పాజిటివ్ గా వెళ్ళిపోయాయి. మరి యాడ్స్ ప్రభావం జనాల్లో ఎంతుంటుందో చూడాల్సిందే.
This post was last modified on November 14, 2023 7:18 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…